కన్సాలిడేషన్‌లో.. ఐటీ వీక్‌

కన్సాలిడేషన్‌లో.. ఐటీ వీక్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాటతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 28 పాయింట్లు క్షీణించి 38,703కు చేరింది. అయితే ఇంట్రాడేలో 38,802-38,610 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 11,578-11,516 మధ్య ఒడిదొడుకులను ఎదుర్కొంది. ప్రస్తుతం 9 పాయింట్ల వెనకడుగుతో 11,547 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్‌ నిరాశపరచడం, అమెరికా మార్కెట్ల నష్టాలు, రూపాయి బలహీనపడటం తదితర ప్రతికూల అంశాల కారణంగా వరుసగా మూడో రోజు మంగళవారం సైతం మార్కెట్లు అత్యధిక సమయం నష్టాల మధ్యే కదిలాయి. అయితే చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి.

బ్యాంక్స్‌ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ 1 శాతం నీరసించగా.. మీడియా, బ్యాంకింగ్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 1-0.3 శాతం మధ్య బలపడ్డాయి. ఫార్మా, మెటల్‌ 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, కోల్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, బ్రిటానియా, ఎన్‌టీపీసీ, టైటన్‌, కొటక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌, టాటా స్టీల్‌ 2-0.5 శాతం మధ్య పుంజుకోగా.. టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్, టాటా మోటార్స్‌, హిందాల్కో, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్, హీరో మోటో, ఎయిర్‌టెల్‌ 2-0.4 శాతం మధ్య క్షీణించాయి. 

ఇండిగో పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో ఆర్‌ఈసీ, ఎన్‌ఎండీసీ, ఐజీఎల్‌, సన్‌ టీవీ, పీవీఆర్‌, మహానగర్‌ గ్యాస్‌, దివాన్‌ హౌసింగ్‌ 3-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు ఇండిగో 13 శాతం కుప్పకూలగా.. రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కేపిటల్‌, అదానీ పవర్‌, హావెల్స్‌, ఐసీఐసీఐ ప్రు, అరవింద్‌ 6-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో ఇప్పటివరకూ 748 షేర్లు లాభపడగా.. 509 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో జీటీపీఎల్‌, స్పైస్‌జెట్‌, జేకే అగ్రి, పనాసియా, కోల్టేపాటిల్‌, మిండా ఇండస్ట్రీస్‌, 8కే మైల్స్‌, 63 మూన్స్‌, తాన్లా, అబాన్‌, సూర్య రోష్నీ తదితరాలు 11-5 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');