ఫ్యాంగ్‌ స్టాక్స్‌ దన్ను- నాస్‌డాక్‌ అప్‌

ఫ్యాంగ్‌ స్టాక్స్‌ దన్ను- నాస్‌డాక్‌ అప్‌

ఫ్యాంగ్‌(FAANG) స్టాక్స్‌కు డిమాండ్‌ పెరగడంతో మంగళవారం టెక్‌ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ బలపడింది. నేడు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ కాంగ్రెస్‌ ముందు ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు. మరోవైపు గత పాలసీ సమీక్ష వివరాలు మినిట్స్‌ ద్వారా వెల్లడికానున్నాయి. జూన్‌ నెలలో వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు ఊపందుకున్నట్లు గత వారాంతాన వెల్లడికావడంతో ఫెడ్‌ చైర్మన్‌ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ స్వల్పంగా 23 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 26,783 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 4 పాయింట్లు(0.1 శాతం) పుంజుకుని 2,980 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 43 పాయింట్ల(0.55 శాతం) ఎగసి 8,142 వద్ద ముగిసింది. 

3ఎం కో వీక్‌
ప్రధానంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, ఐఫోన్ల బ్లూచిప్‌ కంపెనీ యాపిల్‌తోపాటు వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గంజ నెట్‌ఫ్లిక్స్‌ బలపడటంతో అటు ఎస్‌అండ్‌పీ, ఇటు నాస్‌డాక్‌ లాభపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. స్ట్రేంజర్‌ థింగ్స్‌ మూడో సిరీస్‌ రిలీజ్‌ కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయాలు వృద్ధి చెందనున్నట్లు రీసెర్చ్‌ సంస్థ కోవెన్‌ అభిప్రాయపడింది. కాగా.. చైనా, ఆటో రంగాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా 3ఎం కో షేరుని ఆర్‌బీసీ కేపిటల్‌ మార్కెట్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. దీంతో 3ఎం షేరు 2 శాతం క్షీణించింది. ముందురోజు చైనా, అమెరికా వాణిజ్య వివాదాల కారణంగా జర్మన్‌ కెమికల్స్‌ దిగ్గజం బీఏఎస్ఎఫ్‌ నిరుత్సాహకర గైడెన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నికర లాభం 30 శాతం క్షీణించే వీలున్నట్లు అంచనా వేసింది. 
 
ఆసియా సానుకూలం..
మంగళవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 0.2-0.99 శాతం మధ్య నీరసించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. తైవాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, కొరియా, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 0.6-0.2 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో జపాన్‌ 0.2 శాతం బలహీనపడగా.. చైనా నామమాత్ర లాభంతో కదులుతోంది. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ మూడు వారాల గరిష్టం 97.58కు బలపడగా.. యూరో 1.14 వద్ద ట్రేడవుతోంది. జపనీస్‌ యెన్‌ 108.97కు బలహీనపడింది. ట్రెజరీ ఈల్డ్స్‌ 2.067 శాతానికి పుంజుకున్నాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');