TCS Q1 ఫలితాల వెల్లడి 

TCS Q1 ఫలితాల వెల్లడి 

ఐటి సర్వీసు ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) జూన్ 2019 తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.8,131 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది, విశ్లేషకుల అంచనాలను అధిగమించి, కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయం వరుసగా 0.42 శాతం పెరిగి రూ .38,172 కోట్లకు చేరుకుంది.
2019 మార్చి త్రైమాసికంలో లాభం రూ .8,126 కోట్లు
(YoY ) ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో చూస్తే... ఆదాయం 11.4శాతం, ప్రాఫిట్ 10.8శాతంగా ఉన్నాయి.
కన్సాలిడేటెడ్ రెవిన్యూ 0.42శాతం పెరిగి రూ. 38,172 కోట్లుగా చూపింది టీసీఎస్ . 
డాలర్ రూపేణా ఆదాయం 1.6శాతం పెరిగి 5,485 మిలియన్ డాలర్లుగా ఉంది. 
మొత్తం ఆదాయంలో డిజిటల్ రెవిన్యూ 32.2శాతంగా ఉంది. 
లైఫ్ సైన్స్ , హెల్త్ కేర్ రంగంలో ఐటీ సేవలకు గానూ వచ్చిన ఆదాయంలో 18.1శాతం వృద్ధిని కనబరిచింది. 
UK లో ఆదాయం 16శాతం, ఇండియాలో 15.9శాతం , యూరప్‌ లో 15శాతం, నార్త్ అమెరికా రెవిన్యూ 7.7శాతం, ఆసియా పసిఫిక్ లో 9.5శాతం  ఆదాయ వృద్ధిని కనబరిచింది. 
ఎబిటా 3.3శాతం తగ్గి రూ. 9,220 కోట్లుగా టీసీఎస్ చూపింది. 
ఈ త్రైమాసిక ఫలితాల్లో TCS తన స్టాక్స్ పై రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 

 



Most Popular