ఏబీబీ- మేఘమణి జూమ్‌

ఏబీబీ- మేఘమణి జూమ్‌

సోలార్‌ ఇన్వెర్టర్‌ బిజినెస్‌ విక్రయానికి కంపెనీ బోర్డు సూచనప్రాయ అనుమతి ఇచ్చినట్లు ఏబీబీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోపక్క దక్షిణ గుజరాత్‌లోని బారుచ్‌లో క్లోర్‌మిథేన్‌(సీఎంఎస్‌) ప్రాజెక్ట్‌ ఏర్పాటును అనుబంధ సంస్థ మేఘమణి ఫైన్‌కెమ్‌ పూర్తిచేసినట్లు పేర్కొనడంతో మేఘమణి ఆర్గానిక్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. వివరాలు చూద్దాం..
 
ఏబీబీ ఇండియా
ఇటాలియన్‌ కంపెనీ ఫైమర్‌( FIMER) ఎస్‌పీఏకు సోలార్‌ ఇన్వర్టర్‌ బిజినెస్‌ను విక్రయించేందుకు బోర్డు సూచనప్రాయ అనుమతి ఇచ్చినట్లు వెల్లడించడంతో ఏబీబీ ఇండియా లిమిటెడ్‌ షేరు జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 1524 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో రూ. 1558 వరకూ ఎగసింది. ఎలక్ట్రిఫికేషన్‌, రోబోటిక్స్, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ సేవల ఏబీబీ ఇండియాలో ప్రమోటర్లు 75 శాతం వాటా ఉంది. ఏబీబీ గ్రూప్‌ వ్యూహాలలో భాగంగా కంపెనీకి కీలకంకాని విభాగాలను విక్రయిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అధిక వృద్ధికి అవకాశమున్న విభాగాలపైనే దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు.

Image result for meghmani organics limited

మేఘమణి ఆర్గానిక్స్‌
దక్షిణ గుజరాత్‌లోని బారుచ్‌లో 40,000 ఎంటీ వార్షిక సామర్థ్యంతో క్లోర్‌మిథేన్‌(సీఎంఎస్‌) ప్రాజెక్ట్‌ ఏర్పాటును అనుబంధ సంస్థ మేఘమణి ఫైన్‌కెమ్‌ పూర్తిచేసినట్లు మేఘమణి ఆర్గానిక్స్‌ పేర్కొంది. బారుచ్‌లోని జీఐడీసీ దహేజ్‌లోగల కాస్టిక్‌ క్లోరిన్‌ కాంప్లెక్స్‌ వద్దే ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఇందుకు రూ. 160 కోట్లను వెచ్చించినట్లు వెల్లడించింది. మిథిలీన్‌ డైక్లోరైడ్‌ క్లోరోఫామ్‌(ఎండీసీ), కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌ను ఈ ప్లాంటు ద్వారా తయారు చేయనున్నట్లు తెలియజేసింది. ఫార్మా, ఆగ్రోకెమికల్‌ రంగాలకు వీటిని సరఫరా చేయనున్నట్లు వివరించింది. కంపెనీలో ప్రమోటర్లకు 50.68% వాటా ఉంది. ఈ నేపథ్యంలో  ఎన్‌ఎస్‌ఈలో మేఘమణి ఆర్గానిక్స్‌ దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 63కు చేరింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');