నష్టాల్లో మార్కెట్లు ..! అయినా ఈ 10 స్టాక్స్ కేక అంటున్న నిపుణులు!

నష్టాల్లో మార్కెట్లు ..! అయినా ఈ 10 స్టాక్స్ కేక అంటున్న నిపుణులు!

బడ్జెట్ తరువాత మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోయింది. సోమవారం నాటి మార్కెట్లలో చాలా మంది ఇన్వెస్టర్లు సెల్‌ఆఫ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.  నిరాశ పరిచిన బడ్జెట్, గ్లోబల్ క్యూస్ వంటి ఇష్యూస్‌ వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మరో పెద్ద మోసం బయట పడటంతో ఆ బ్యాంక్ షేర్ ఒక్కసారిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పలువురు స్టాక్స్ ఎనలిస్టులు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఈ 10 స్టాక్స్ రానున్న 2-3 వారాల్లో మంచి ప్రాఫిట్స్‌ను అందిస్తాయని అంటున్నారు. అవేంటో చూద్దామా..!
BP ఈక్విటీస్ అంచనాలు 
1. కాన్‌కోర్ (Concor):     Buy: టార్గెట్ ప్రైస్ రూ. 640 : స్టాప్ లాస్ రూ. 525 :  
2. MCX :                      Buy: టార్గెట్ ప్రైస్ రూ. 940 : స్టాప్ లాస్ రూ. 780
.......

ఏంజిల్ బ్రోకింగ్ అంచనాలు
3. కాల్గేట్ పామోలివ్ (ఇండియా):  Buy :  టార్గెట్ ప్రైస్ రూ. 1,250: స్టాప్ లాస్ రూ. 1.137
4. యునైటెడ్ స్పిరిట్స్ :              Buy : టార్గెట్ ప్రైస్ రూ. 621 : స్టాప్ లాస్ రూ. 557
........

ప్రభుదాస్ లీలాధర్ అంచనాలు
5. కోటక్ మహీంద్రా బ్యాంక్ :  Buy : టార్గెట్ ప్రైస్ రూ. 1,600 : స్టాప్ లాస్ రూ. 1,460
6. ITC :                          Buy : టార్గెట్ ప్రైస్ రూ. 315 : స్టాప్ లాస్ రూ. 270 
.....

ఛార్ట్ వ్యూ ఇండియా .ఇన్ అంచనాల ప్రకారం
7. ఈక్విటాస్ హోల్డింగ్స్ ; Buy : టార్గెట్ ప్రైస్ రూ. 135 : స్టాప్ లాస్ రూ. 117
8. సోనాటా సాఫ్ట్ వేర్ :    Buy : టార్గెట్ ప్రైస్ రూ. 390 : టార్గెట్ ప్రైస్ రూ. 346
.......

SMC గ్లోబల్ సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం
9. CESC :                Buy : టార్గెట్ ప్రైస్ రూ. 830-845 : స్టాప్ లాస్ రూ. 740
10. ముత్త్హూట్ ఫైనాన్స్ : Buy : టార్గెట్ ప్రైస్ రూ. 700-715 : స్టాప్ లాస్ రూ. 600
........

పైన పేర్కొన్న ఈ 10 స్టాక్స్ MACD, 200 రోజుల DEMA (డే ఎక్స్‌పెన్షియల్ మూవింగ్ యావరేజ్ ) లు డైలీ ఛార్టుల్లో మంచి పనితీరును కనబరుస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక , స్వల్పకాలిక బయాస్‌లు పాజిటివ్ ట్రెండ్ లో కనబడుతున్నాయి. వీక్లీ ఛార్టుల్లో కూడా ఇవి బుల్లిష్ సిగ్నల్స్ ను వెలువరుస్తున్నాయని , కన్సాలిడేషన్ రేంజ్‌ను ఇవి దాటొచ్చని ఛార్ట్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ స్టాక్స్ బయ్యింగ్ మూమెంటమ్ కొనసాగవచ్చని , 2-3 వారాల్లో ఇవి మంచి ప్రాఫిట్స్ ను అందిస్తాయని బ్రోకింగ్ కంపెనీలు భావిస్తున్నాయి.  

Disclaimer: పైన పేర్కొన్న సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు, స్టాక్ ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.