ఆటో రంగానికి ఏమైంది..?  బడ్జెట్ తరువాత మరింత డీలా!

ఆటో రంగానికి ఏమైంది..?  బడ్జెట్ తరువాత మరింత డీలా!

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2019 ఆటో రంగాన్ని మరింత కుంగదీసిందా? ఇప్పటికే విక్రయాలు లేక వెల వెల బోతున్న ఆటో సెక్టార్ భవిష్యత్తు మరింత దిగజారనుందా? అవుననే అంటున్నారు ఆటో మార్కెట్ విశ్లేషకులు. నేటి సోమవారం నాటి మార్కెట్ ఓపెనింగ్‌లోనే  సెన్సెక్స్ 415 పాయింట్లు, నిఫ్టీ 122.4 పాయింట్లు నష్టపోయాయి. దీంతో పాటు ఆటో స్టాక్స్ ఎరుపు సూచీల్లో కదలాడుతున్నాయి. హీరో మోటో కార్ప్ 3.91శాతం నష్టపోగా, మదర్ సన్ సుమీ సిస్టమ్స్ 3.13 శాతం, అపోలో టైర్స్ 3.12శాతం, మారుతీ సుజుకీ 3.00శాతం నష్టపోయాయి. అలాగే టీవీఎస్ మోటార్ కంపెనీ 2.82శాతం, బజాజ్ ఆటో 2.55శాతం , అశోక్ లేల్యాండ్ 2.13శాతం, టాటా మోటార్స్ 2.09శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2.22 శాతం క్షీణతతో 7674.85 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఆటో రంగంలోని 50 స్టాక్స్ లో 42 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతుండగా, కేవలం 8 స్టాక్స్ మాత్రమే లాభాల బాటలో ఉన్నాయి. 

Image result for auto sector in india
కార్ల సెక్టార్‌లోని మారుతీ సుజుకీ సోమవారం నాటి మార్కెట్‌ ఆరంభంలోనే 3 శాతం నష్టపోయింది. కంపెనీ తన కార్ల ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ప్రకటించడం, విక్రయాలు తగ్గడం వంటి కారణాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. దీంతో మారుతీ సుజుకీ స్టాక్స్ రూ. 6,170.05 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం మేరకు మొత్తం అన్ని రకాల మోడల్స్ మీద ఉత్పత్తిని తగ్గించినట్టు తెలుస్తుంది. గత జూన్ వరకూ మొత్తం మీద 1,11,917 యూనిట్లు ఉత్పత్తి చేయగా , గత యేడాది ఇది 1,32,616 యూనిట్లుగా ఉంది. మినీ కార్ల ఉత్పత్తిని కూడా కొంత వరకూ నిలిపి వేస్తున్నట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. ఆల్టో తయారీని 48.20శాతం తగ్గించగా, స్విఫ్ట్ డిజైర్ ఉత్పత్తిని 1.46శాతం తగ్గించింది. యుటిలిటీ వెహికిల్స్ అమ్మకాల్లో దాదాపు 5.26శాతం క్షీణతను, వ్యాన్ల రంగంలో 27.87శాతం విక్రయాల క్షీణతను చవి చూసిన మారుతీ సుజుకీ తాజాగా తన కార్ల తయారీని నిలిపివేసి ఉండొచ్చని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. 

Image result for auto sector in india
మొత్తం మీద ఆటో సెక్టార్‌లోని తయారీ దారులు తమ వాహనాల అమ్మకాలలో అధిక క్షీణతను చవిచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మధ్యతరగతి వర్గం ప్రస్తుతం వాహనాల కొనుగోళ్ళపై సముఖత వ్యక్తం చేయకపోవడంతో, కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సవరించుకోవాల్సి వస్తుందని ఆటో నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే పండుగల సీజన్‌లోనైనా ఈ పరిస్థితి మారొచ్చని ఆటో సెక్టార్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. 
 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');