బడ్జెట్ తరువాత మెరిసిన స్టాక్స్ ఇవే...!

బడ్జెట్ తరువాత మెరిసిన స్టాక్స్ ఇవే...!

2019 జులైలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రకారం ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లు(రూ.204 లక్షల కోట్లు)కు చేరింది. దీంతో మన దేశం  ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో మన ఆర్ధిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు  తీసుకుపోడానికి తగిన సంస్కరణలను , పాలసీలను చేస్తున్నామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తూ.., గ్రామీణ భారతావనిని మరింత ఉద్దీపనం చేయడానికి నిర్మలా సీతారామన్ కంకణం కట్టుకున్నామని ప్రకటించారు. అదే విధంగా ఇన్ఫ్రా రంగంలో అభివృద్ధి, నాన్ బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతులు వంటివి ఆయా రంగాలకి దన్నుగా నిలవనున్నాయి. ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ రైజింగ్ క్యాపిటల్  వంటి విధానాలతో విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడానికి యత్నాలు చేస్తున్నామని నిర్మల అంటున్నారు. స్ట్రక్చరల్ సంస్కరణలకు అధిక విలువనిస్తూ.. , ఆర్ధిక వ్యవస్థకు మరింత ఊతమిస్తామని బడ్జెట్‌ ద్వారా పేర్కొన్నారు. నీటి పారుదల, పవర్ సెక్టార్ రంగంలో ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో ఆయా సెక్టార్‌లోని షేర్లలో కదలిక మొదలైందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 
బడ్జెట్ వెలువడిన వెంటనే మార్కెట్లు కాస్త నిరాశకు గురైనప్పటికీ... కొన్ని స్టాక్స్ మాత్రం పుంజుకున్నాయి. ఇన్ఫ్రా రంగంలోని NBCC, L&T , సిమెంట్ రంగంలోని ఆల్ట్రా టెక్ సిమెంట్, ACC సిమెంట్ వంటి స్టాక్స్ లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతే కాకుండా  కెనరా బ్యాంక్, FMCG స్టాక్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫియామ్ ఇండస్ట్రీస్ వంటి వాటిని  బెస్ట్ పిక్స్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ స్టాక్స్ ఇన్వెస్టర్లకు  లాభాలు తీసుకురానున్నాయని వారు పేర్కొంటున్నారు. 


Disclaimer: పైన పేర్కొన్న సలహాలు , సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, నిపుణులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.