ఇక త్రైమాసిక ఫలితాలపైనే చూపు

ఇక త్రైమాసిక ఫలితాలపైనే చూపు

సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సార్వత్రిక బడ్జెట్‌ వెలువడింది. బడ్జెట్‌ రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే బడ్జెట్‌ ప్రతిపాదనల సంపూర్ణ విశ్లేషణ తదుపరి ఈ వారం నుంచి వీటి ప్రభావం మార్కెట్లపై కనిపించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. పార్లెమెంట్‌లో బడ్జెట్‌ సెషన్‌ ఈ నెల 26 వరకూ కొనసాగనుంది. కాగా మరోపక్క పారిశ్రామికోత్పత్తి వృద్ధి(ఐఐపీ),  రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. అంతేకాకుండా ఇకపై దేశీ కార్పొరేట్ల తొలి త్రైమాసిక(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మార్కెట్ల ట్రెండ్‌ ఫలితాలు, ఆర్థిక గణాంకాలు తదితర అంశాలపై ఆధారపడి నిర్ణయంకానున్నట్లు నిపుణులు తెలియజేశారు.

ఇదీ జాబితా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ1 ఫలితాలను ప్రకటించనున్న కంపెనీ జాబితాలో ఈ వారం సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్ ఉన్నాయి. టీసీఎస్‌ 9న(మంగళవారం), ఇన్ఫోసిస్‌ 12న(శుక్రవారం) ఫలితాలు విడుదల చేయనున్నాయి. కాగా.. ఇదే రోజు మే నెలకు ఐఐపీ, జూన్‌ నెలకు సీపీఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ఐఐపీ 3.4 శాతం వృద్ధి చూపగా.. మే నెలలో సీపీఐ 3.05 శాతంగా నమోదైంది.

విదేశీ అంశాలు
మార్కెట్లను ప్రభావితం చేయగల  విదేశీ అంశాలలో ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్షా వివరాలు(మినిట్స్‌) బుధవారం వెల్లడికానున్నాయి. గత సమీక్షలో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను 2.25-2.5 శాతం స్థాయిలో యథాతథంగా అమలు చేసేందుకు నిర్ణయించిన విషయం విదితమే. ఇవికాకుండా ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు తదితర పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు వివరించారు.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');