2020 కల్లా 3 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ

2020 కల్లా 3 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ

తొలిసారి పూర్తిస్థాయిలో ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ అధ్యక్షతన తొలిసారి ఆర్థిక మంత్రిగా సీతారామన్‌ తొలి బడ్జెట్‌ను రూపొందించారు. ప్రభుత్వ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, తదితర పార్టీ ఎంపీల హాజరు నడుమ పార్లమెంట్‌లో  సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం ఉదయం 11కల్లా ప్రారంభమైంది. వెరసి మోడీ 2.0 ప్రభుత్వం రూపొందించిన 2019-20 ఆర్థిక పద్దు వివరాలు చూద్దాం.. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికల్లా దేశ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్ల(రూ. 207 లక్షల కోట్లు)కు చేర్చనున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ బాటలో త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ స్థాయిని చేరుకునేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు 10 పాయింట్లను ప్రస్తావించారు. కొనుగోలు శక్తి (పీపీపీ) రీత్యా 2.7 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే అమెరికా, చైనా తదుపరి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 1 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకావడానికి 55 ఏళ్లు పట్టగా.. 5 ఏళ్ల కాలంలోనే మరో ట్రిలియన్‌ డాలర్ల విలువను సాధించాం. ఈ బాటలో 3 ట్రిలియన్‌ డాలర్ల విలువకు చేరువైనట్లు తెలియజేశారు..

హైలైట్స్‌...
-రూ. 2-5 కోట్ల ఆదాయం కలిగిన వ్యక్తులపై 3 శాతం అదనపు పన్ను- 5 కోట్లకు మించిన ఆదాయం కలిగిన వ్యక్తులు 7 శాతం అదనపు సర్‌ చార్జీ చెల్లించవలసి ఉంటుంది.
-రుణాలపై ఎలక్ట్రిక్‌ వాహనాలు  కొనుగోలుచేసే మధ్యతరగతి వ్యక్తులు రూ. 1.5 లక్షల వరకూ వడ్డీ చెల్లింపులపై ఆదాయ పన్నులో అదనపు డిడక్షన్‌ పొందవచ్చు.
-బ్యాంకు ఖాతాల నుంచి ఏడాదికి రూ. 1 కోటికి మించి నగదు తీసుకుంటే 2 శాతం టీడీఎస్‌ వర్తింపు. 
-రూ. 50  లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన సంస్థలలో భీమ్‌, యూపీఐ, నెఫ్ట్‌, ఆధార్‌ పే తదితర మార్గాలలో చేపట్టే కస్టమర్ల చెల్లింపులపై ఎలాంటి చార్జీల విధింపు ఉండబోదు. 
-ప్రత్యక్ష పన్నుల ఆదాయం 2013-14తో పోలిస్తే 2018-19 కల్లా 78 శాతం దూసుకెళ్లింది.
-ఇకపై రూ. 450 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన కంపెనీలపై మాత్రమే 25 శాతం కార్పొరేట్‌ పన్ను. ఇప్పటివరకూ రూ. 250 కోట్లుగా వర్తింపు
-స్టార్టప్‌లపై ఏంజెల్‌ ట్యాక్స్‌ విధింపు నిబంధనల సడలింపు
-స్టార్టప్‌లు సమీకరించే పెట్టుబడుల అంశంలో దాఖలు చేసే రిటర్నులపై ఆదాయ పన్ను స్థూలశోధన ఉండబోదు.
-బంగారం, ఆభరణ దిగుమతులపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు
-పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ లీటర్‌కు రూ. 1 వడ్డింపు
-త్వరలో  1, 5, 10, 20 నాణేల విడుదల 

బ్యాంకింగ్‌లో..
-గత ఏడాది కాలంలో రూ. లక్ష కోట్ల మొండి బకాయిల(ఎన్‌పీఏలు) రికవరీ. 
-ఐబీసీ ద్వారా గత నాలుగేళ్లలో రూ. 4 లక్షల కోట్లమేర ఎన్‌పీఏల రికవరీ
-ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్లమేర తాజా పెట్టుబడుల ప్రతిపాదనలు.
-హౌసింగ్‌ ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ ఇకపై ఎన్‌హెచ్‌బీ నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ చేతికి
-మూలాలు(ఫండమెంటల్స్‌) పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల నుంచి రుణాలు


-ఎస్‌పీవీల ద్వారా సబర్బన్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు  రైల్వేలకు అవకాశం
-రానున్న ఐదేళ్లలో మౌలిక సదుపాయాల రంగానికి రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు

-ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.05 లక్షల కోట్ల సమీకరణ ప్రతిపాదనలు

-రియల్టీ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహకంగా తీసుకువచ్చిన ఆర్‌ఈఐటీ, ఇన్విట్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను అనుమతించే యోచన. ఎఫ్‌పీఐ రూట్‌లో ఎన్‌ఆర్‌ఐ పోర్ట్‌ఫోలియోను విలీనం చేసే ప్రతిపాదనలు.
-గ్యాన్‌(జీవైఏఎన్‌) పథకం ద్వారా అంతర్జాతీయ సైంటిస్టులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌ సేవల వినియోగం. ఐదేళ్ల క్రితంవరకూ టాప్‌-200 జాబితాలోలేని దేశీ యూనివర్శిటీలు. గ్యాన్‌ ప్రభావంతో ప్రస్తుతం టాప్‌-200 గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూల్స్‌ జాబితాలో 3 దేశీ సంస్థలకు చోటు. ప్రపంచ స్థాయి హైయర్‌ ఎడ్యుకేషన్‌కు దన్నుగా రూ. 400 కోట్లు కేటాయింపు
-ఏఐ, బిగ్‌ డేటా, రోబోటిక్స్‌ తదితర  విభాగాలలో యువతకు నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా ప్రణాళికలు. తద్వార దేశ, విదేశాలలో ఉద్యోగ అవకాశాలను అందుకునేందుకు వీలుగా నైపుణ్య శిక్షణ. 
-శ్రామిక శక్తికి మద్దతుగా విభిన్న కార్మిక చట్టాల స్థానే నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకువచ్చే ప్రతిపాదనలు.

-స్వచ్చభారత్‌లో భాగంగా 9.6 కోట్ల టాయిలెట్ల నిర్మాణం- 5.6 లక్షల గ్రామాలకు లబ్ది
-విద్యుత్‌ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు. చార్జింగ్‌ స్టేషన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు
-జాతీయ విద్యా విధానం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విద్యనందించేందుకు ప్రణాళికలు
-మహాత్మా గాంధీ విలువలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా వికీపీడియా తరహాలో గాంధీపీడియాకు రూపకల్పన
-అంతరిక్షంలో ప్రధాన శక్తిగా భారత్‌ ఆవిర్భావం. ఇస్రో పటిష్టతకు, లబ్దిని చేకూర్చేందుకు వీలుగా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) ఏర్పాటు. తద్వారా అంతరిక్ష శక్తిని వాణిజ్యపరంగా వినియోగించుకునే ప్రణాళికలు.

-ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనలో భాగంగా లబ్దిదారులకు  1.95 కోట్ల గృహాలు- 2022కల్లా అందరికీ విద్యుత్‌ కనెక్షన్‌
-బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపు యోచన- తద్వారా యూరోపియన్‌, దక్షిణాసియా కంపెనీలకు దేశీ మార్కెట్లో అవకాశాలు
-పీఎం గ్రామ్‌ సడక్‌ యోజనలో భాగంగా రూ. 80,200 కోట్లతో దాదాపు 125000 కిలోమీటర్లమేర రహదారుల ఆధునీకరణ
-విమానయాన రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం- ప్రభుత్వ విమానయాన రంగ సంస్థ ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయ ప్రతిపాదనలు

-భారత్‌ మాల, సాగర్‌మాల, ఉడాన్‌ కార్యక్రమాల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వారధిని ఏర్పాటు చేశాం. తద్వారా దేశ మౌలిక సదుపాయాల రంగాన్ని మరింత విస్తరించాం. ఉడాన్‌ ద్వారా కామన్‌ మ్యాన్‌కూ విమానయాన సౌకర్యాలకు అవకాశమేర్పడింది.
-300 కిలోమీటర్లమేర రైల్‌, మెట్రో ప్రాజెక్టులకు అనుమతి.
-మ్యాన్యుఫాక్చరింగ్‌, రిపేర్, ఆపరేట్‌(ఎంఆర్‌వో) పరిశ్రమ ఏర్పాటు ప్రణాళికలు
-రోడ్‌, రైల్వేలలో ప్రయాణించేందుకు వీలుగా జాతీయ రవాణా కార్డ్‌ రూపొందించే ప్రణాళికలు
-రుపే కార్డ్‌ ద్వారా వివిధ రవాణా మార్గాలు, సాధనాలలో ప్రయాణించేందుకు వీలుగా చెల్లింపులు
-రాష్ట్రాలకు అందుబాటు ధరల్లో విద్యుత్‌ కల్పనకు ఒన్‌ నేషన్‌ ఒన్‌ గ్రిడ్‌ ప్రణాళికలుMost Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');