కేఆర్‌బీఎల్‌- జెట్‌ ఎయిర్‌వేస్‌ పతనం

కేఆర్‌బీఎల్‌- జెట్‌ ఎయిర్‌వేస్‌ పతనం

ఇండియాగేట్‌ బ్రాండు బాస్మతి రైస్‌ ఎగుమతుల సంస్థ కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌కు చెందిన సంగ్రూర్‌ రైస్‌మిల్లును ఈడీ అటాచ్‌ చేసినట్లు వెలువడిన వార్తలు ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశాయి. కాగా.. మరోపక్క నిధుల మళ్లింపు, ఇతర అక్రమాలపై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వెలువడిన వార్తలు ప్రయివేట్‌ రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం పంజాబ్‌.. సంగ్రూర్‌లోని కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌కు చెందిన రైస్‌మిల్‌ను, సంబంధిత భూమినీ అటాచ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా వెల్లడించింది. వీటి విలువను రూ. 15.32 కోట్లుగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 299 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 284 దిగువకూ చేరింది. 

Image result for Jet airways ltd

జెట్‌ ఎయిర్‌వేస్‌
ప్రయివేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణలో నిధుల మళ్లింపు తదితర పలు అక్రమాలు జరిగిన నివేదిక నేపథ్యంలో తాజాగా కార్పొరేట్‌ ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు వ్యవహారాల శాఖ.. ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు ఎస్‌ఎఫ్‌ఐవో సమన్లు జారీ చేసే అవకాశమున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 62.25 వద్ద ఫ్రీజయ్యింది. అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులకు కరవుకావడంతో 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది.