ఈ చిన్న షేర్లకు కొనుగోళ్ల జోష్‌

ఈ చిన్న షేర్లకు కొనుగోళ్ల జోష్‌

మార్కెట్లు లాభాలతో హుషారుగా కదులుతున్న నేపథ్యంలో పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా పెరగడం గమనించదగ్గ అంశం. జాబితాలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఆర్‌సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌, సైబర్‌టెక్‌ సిస్టమ్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌, మన్‌పసంద్‌ బెవరేజెస్‌ లిమిటెడ్‌ చోటుచేసుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9.5 శాతం దూసుకెళ్లి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 168 వరకూ ఎగసింది. గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటున 15,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 5400 షేర్లు చేతులు మారాయి. 

ఆర్‌సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 50 వరకూ ఎగసింది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1,900 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో 30,400 షేర్లు చేతులు మారాయి. 

సైబర్‌టెక్‌ సిస్టమ్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌:  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 19 శాతం పురోగమించి రూ. 58 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 58.50 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3400 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 57,000 షేర్లు చేతులు మారాయి. 

మన్‌పసంద్‌ బెవరేజెస్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 43 వద్ద ఫ్రీజయ్యింది. ఏడాది కాలంగా పతనబాటలో సాగిన ఈ షేరు ఇటీవల మూడు రోజులుగా 5 శాతం చొప్పున జంప్‌చేస్తుండటం గమనార్హం. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో  83,000 షేర్లు చేతులు మారాయి.