బడ్జెట్ ఎఫెక్ట్...! MACD ఛార్టుల్లో 126 స్టాక్స్ బుల్లిష్ ట్రెండ్ !!

బడ్జెట్ ఎఫెక్ట్...! MACD ఛార్టుల్లో 126 స్టాక్స్ బుల్లిష్ ట్రెండ్ !!

జులై 5 న రానున్న యూనియన్ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లు బడ్జెట్‌ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. గత కొద్ది వారాలుగా గ్లోబల్ ట్రెండ్స్, అమెరికా ఫెడ్ రేట్లు, చైనా అమెరికా ట్రేడ్ వార్, చమురు ధరలు , పసిడి అననుకూలత వంటి వాటితో దేశీయ మార్కెట్లు మందకోడిగా సాగాయి. బడ్జెట్ సమీపిస్తున్న కొద్దీ దేశీయ స్టాక్ మార్కెట్లలో MACD ఛార్టులను పరిశీలిస్తే... దాదాపు 126 స్టాక్స్  HDFC, బజాజ్ ఆటో , బజాజ్ ఫిన్ వంటి వాటితో సహా మంచి స్ట్రాంగ్ ట్రెండ్‌ను కనబరుస్తున్నాయి. ఈ స్టాక్స్ లో బుల్లిష్ ట్రెండ్ కనబడుతోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ (MACD) ప్రకారం బడ్జెట్ అనంతరం ఈ స్టాక్స్ మంచి రిటర్న్స్ ను అందించనున్నట్టు సమాచారం. 

up 126 a
ఎమర్జింగ్ ట్రెండ్ కోసం మంచి ట్రేడింగ్ వాల్యూమ్స్ కనబరుస్తున్న స్టాక్స్ లో డాబర్ ఇండియా, HDFC బ్యాంక్,  ఎక్సైడ్ , బజాజ్ ఫిన్, JSW ఎనర్జీ, బజాజ్ ఆటో , UCO బ్యాంక్ , PVR, HDFC లైఫ్ ఇన్స్యూరెన్స్ వంటివి ఉన్నాయి. టెక్నికల్ ఛార్టుల్లో మూమెంటమ్ ఇండికేటర్ బుల్లిష్ క్రాసోవర్ ను కనబరుస్తున్నాయి..ఈ కౌంటర్లలో. కన్జ్యూమర్స్ సెక్టార్‌కు బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఉండొచ్చన్న అంచనాలు ఈ స్టాక్స్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.వ్యవసాయం, పరిశ్రమలు వంటి పలు రంగాలకు ఈ సారి బడ్జెట్‌లో మరింత ఊతమిచ్చే పథకాలు ఉండొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. 

MACDPic Courtesy By: Economic Times 


సింటెక్స్ ప్లాస్టిక్స్, సీమెన్స్, దీపక్ నైట్రేట్ , రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ , ఉషా మార్టిన్ , JP అసోసియేట్స్ వంటి స్టాక్స్ కూడా MACD ఛార్టుల్లో బుల్లిష్ సిగ్నల్స్ ను వెలువరుస్తున్నాయి. NSE లోని ఓ 17 స్టాక్స్ కూడా బుల్లిష్ ట్రెండ్‌ను కనబరుస్తున్నాయి. సిగ్నల్‌ లైన్‌ పైకి నమోదు అవుతున్న ఈ స్టాక్స్ లో ఆయిల్ ఇండియా , అంబుజా  సిమెంట్స్ , ముత్తూట్ ఫిన్, NCC, మహానగర్ గ్యాస్ , DCB బ్యాంక్ , శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ వంటివి ఉన్నాయి. 
MACD ఇండికేటర్‌ను ఆధారంగా చేసుకుని ఎక్స్‌పర్ట్స్ బై , సెల్ కాల్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా.. టెక్నికల్ ఛార్టుల్లో ఈ స్టాక్స్ కదలికలు బడ్జెట్ అనంతరం వేగంగా పుంజుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. బడ్జెట్ తరువాత నిఫ్టీ 11,900- 12,300 వరకూ పెరగొచ్చని, అలాగే సెన్సెక్స్ 40,300 పాయింట్లకు పైగా నమోదు కావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

up 126 2

up 3

Disclaimer: పైన ఉదహరించిన సలహాలు సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి
మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి