అన్‌లిస్టెడ్ మార్కెట్లో ... ఈ-కామర్స్ స్టాక్స్ దూకుడు! 

అన్‌లిస్టెడ్ మార్కెట్లో ... ఈ-కామర్స్ స్టాక్స్ దూకుడు! 

అన్‌ లిస్టెడ్ మార్కెట్లలో ఈ-కామర్స్ స్టాక్స్ సంచలనాన్నే సృష్టిస్తున్నాయి. దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇన్వెస్టర్లు కూడా ఈ స్టాక్స్ కౌంటర్ల ముందు క్యూ కడుతున్నారు. అన్‌లిస్టెడ్ కంపెనీలైన ఓలా (ANI టెక్నాలజీస్), ఓయో రూమ్స్ (ఓర్వెల్ స్టేస్ ) , పేటీఎం (వన్ 97 కమ్యునికేషన్స్ ) వంటి కంపెనీలు అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. వాటి నామ మాత్రపు విలువతో స్మాల్ , రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే అన్‌ లిస్టెట్ రంగంలో ఉన్న సవాళ్ళు , రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకోకుండా ఇన్వెస్టర్లు ఈ కౌంటర్ల వద్దకు తరలి వెళ్తున్నారు. ఇలాంటి స్టాక్స్ లో విలువ హెచ్చుతగ్గులు ఎక్కువగ ఉంటాయని, ద్రవ్య లభ్యత కూడా తక్కువగా ఉంటుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. అన్‌ లిస్టెడ్ రంగంలో ఓలా స్టాక్ రూ. 27,500, ఓయో రూమ్స్ స్టాక్ రూ.75,000, పేటీఎం షేర్ ధర రూ. 17,000 వరకూ పలుకుతుందని ఈ రంగంలో ఉన్న  అభిషేక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఈ కంపెనీలు కొన్ని సార్లు తీవ్ర నష్టాలను ప్రకటించినా.. ఈ షేర్ వాల్యూ మాత్రం తగ్గడం లేదు. పేటీఎం కు చెందిన వన్ 97 కమ్యునికేషన్స్ 2018 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ. 3,314.8 కోట్ల రెవిన్యూ ను చూపగా, అదే సమయంలో రూ. 1.606.05 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. 2017 ఆర్ధిక సంవత్సరంలో ఈ నష్టాలు రూ. 903.09 కోట్లుగా ఉన్నాయి. వన్ 97 తోబాటు పేటీఎం మాల్‌ కూడా 2018 ఆర్ధిక సంవత్సరానికి రూ. 1,787.55 కోట్ల రెవిన్యూను, రూ. 774.86 కోట్ల నష్టాలను ప్రకటించింది. 2018 ఆర్ధిక సంవత్సరం వరకూ ఈ రెండు సంస్థల నష్టాలను మొత్తం కలిపితే.. 270శాతం పెరిగి రూ. 3,393 కోట్లకు చేరింది . అలాగే మార్చ్ 2018 నాటికి ఓయో రూమ్స్ వెల్లడించిన ఫలితాలను చూస్తే.. అందులో ఓయో ఇండియా నెట్ లాస్ రూ.360 కోట్లు గా ప్రకటించింది. ఇది గత 2017లో మార్జినల్ లాసెస్ రూ. 355 కోట్లుగా ఉంది. అయితే రెవిన్యూ మాత్రం మూడు రెట్లు పెరిగింది. 2016-17 సంవత్సరాల్లో రెవిన్యూ రూ. 120కోట్లుగా ఉంటే.. 2018 నాటికి ఆపరేషనల్ రెవిన్యూ రూ. 416 కోట్లకు చేరింది. ఇక ఫ్లిప్ కార్ట్ ఇండియా 2017లో నెట్ లాస్‌ రూ. 245 కోట్లుగా ఉంటే..అది 2018 నాటికి 700శాతం పెరిగి రూ. 2,060 కోట్ల నష్టాలను ప్రకటించింది. 
మరి ఇన్ని నష్టాలను ప్రకటించిన ఈ సంస్థల స్టాక్ వాల్యూ అన్‌ లిస్టెడ్ మార్కెట్లలో ఎందుకు అలా దూసుకెళ్తున్నాయి? దీనికి సమాధానంగా " ఈ కామర్స్ పరిశ్రమలో వ్యాపార నమూనాలు సాధారణ , సాంప్రదాయ వ్యాపారాలకు భిన్నంగా ఉంటాయి. వారు భూమి లేదా, గోడౌన్లు వంటి స్పష్టమైన ఆస్తులను కూడా కలిగి ఉండరు. భారీ నష్టాలను ప్రకటించినా.. వారి కంపెనీ వాల్యూయేషన్స్ బిలియన్ల డాలర్ల విలువ కలిగి ఉంటాయ"ని అభిషేక్ సెక్యురిటీస్ పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా ఫ్లిప్ కార్ట్ తన కంట్రోలింగ్ వాటాలను వాల్ మార్ట్‌ కు రూ. 1.11 లక్షల కోట్లకు అమ్మిన విషయాన్ని బ్రోకింగ్ కంపెనీలు చూపుతున్నాయి. ఈ కామర్స్ సంస్థలు వాస్తవానికి వర్చ్యువల్ షాప్స్ ను కలిగి ఉంటాయి. వాటి అమ్మకాలు , లావాదేవీలనే   ఈ కామర్స్ సంస్థలు ఎక్కువ చేసి చూపిస్తాయి. దీంతో సాధారణ ఇన్వెస్టర్లు కంపెనీ సేల్స్ ను ప్రాతిపదికగా చూస్తారని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

 Image result for ola logoImage result for oyo logo
ఇలా నష్టాలను ప్రకటించిన కంపెనీల స్టాక్స్ అన్ లిస్టెడ్ మార్కెట్లో రూ. 10,000 కు మించి ట్రేడ్ అవుతుండటం సాధారణ ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తుంది. ఎనలిస్టుల సలహా ఎంటంటే.. ఈ కామర్స్ వ్యాపారం ప్రస్తుతం ట్రెండీగానే కనబడుతున్నప్పటికీ.. ఒక్కసారిగా సెంటిమెంట్ వీక్‌ అయితే కనుక ఈ స్టాక్స్ మీద పెట్టుబడులను ఉపసంహరించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. ఈ కంపెనీలు తమ వ్యాపార లావాదేవీల ఆధారంగానే తమ వాల్యూయేషన్‌ను ప్రకటించుకుంటాయి. కానీ వాటి వాస్తవిక వాల్యూ  ఫేయిర్ గా ఉండకపోవడాన్ని మనం చూస్తామని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కాక పోవడం వల్ల వీటికి రూల్స్ వర్తించవు.  వాటా దారులకు బోనస్లు, హక్కులు వంటివి ఏమీ ఉండవు. అందువల్లే ఈ స్టాక్స్ వాల్యూ విపరీతంగా మనకు కనబడుతోందని ఎనలస్టులు వివరిస్తున్నారు. అన్‌ లిస్టెడ్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తతో అప్రమత్తులై ఉండాల్సిందేనని మార్కెట్ విశ్లేషకులు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. 
 
Image result for flipkart logo


Disclaimer: పైన సూచించిన సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే.
స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరి చూసుకోగలరని మనవి.