ఎలక్ట్రిక్ వాహనాలతో గ్యాస్ కంపెనీల పనైపోతుందా ?

ఎలక్ట్రిక్ వాహనాలతో గ్యాస్ కంపెనీల పనైపోతుందా ?

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో మన భారత దేశం అగ్రరాజ్యంగా మారింది. మన దేశంలోని అత్యధిక నగరాలు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2023 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలనే(EVs) అనుమతించాలన్న యోచనలో ఉంది. డీజిల్, పెట్రోల్ లాంటి శిలాజ ఇంధనాలు తరిగి పోతున్న నేపథ్యంలో వాటి వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. అయితే.. దేశంలో ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉన్న సీఎన్‌జీ గ్యాస్ వాహనాలను కూడా 2023 తరువాత  నిలిపివేస్తామన్న వార్తలు రావడంతో ఇప్పుడు గ్యాస్ కంపెనీల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. గ్యాస్ కంపెనీలు తమ ప్లాంట్ల విస్తరణ కోసం పెట్టిన రూ. 1.2 లక్షల కోట్లు గాల్లో దీపంలా మారాయి. దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను వేగంగా చొచ్చుకుపోయే విధంగా, విధాన రూపకల్పన ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్న నీతి ఆయోగ్, 2030 తరువాత ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Image result for electric cars

కేంద్రం నియమించిన నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం 2030 తరువాత కేవలం విద్యుత్‌తో నడిచే వాహనాలనే మార్కెట్లోకి తీసుకురావాలని పేర్కొంది. అంతే కాకుండా శిలాజ ఇంధనాలు వాడే త్రీ వీలర్స్ ఆటోలు 2023 కల్లా బ్యాన్ చేయాలని, 2025 నాటికి టూ వీలర్స్, 2026 నాటికి ట్యాక్సీలను నిషేధించాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి నివేదించింది. ఈ గడువు తరువాత రోడ్ల మీద కేవలం విద్యుత్‌తో నడిచే వాహనాలనే అనుమతించాలన్నది నీతిఆయోగ్ ప్రతిపాదన. ఒక వేళ ఇది అమల్లోకి వస్తే.. ప్రధానంగా నష్టపోయేది.. గ్యాస్ కంపెనీలే అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

no-fuel-for-growth

ఇప్పటికే పలు గ్యాస్ కంపెనీలు తమ రిటైల్ అవుట్ లెట్ల కోసం, లైసెన్సుల కోసం వేల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టాయి. సీఎన్‌జీ రంగంలో ఇది మరింత ఎక్కువగా ఉందని, రానున్న 5-6 సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే రోడ్ల మీద ఉంటే.. తాము తీవ్రంగా నష్టపోతామని, భవిష్యత్తును ముందే ఊహించే బ్యాంకులు తమకు రుణాలు కూడా ఇవ్వవని సిటీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ ప్రతినిధులు వాపోతున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న గ్యాస్ లైసెన్స్ దారులు తమ లైసెన్సుల కోసం  ప్రభుత్వానికి పలు హామీలు ఇచ్చారు. వాటిలో 7,200 కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్ స్టేషన్లు నిర్మిస్తామని, 3.5 కోట్ల గృహాలకు గ్యాస్ పైప్ లైన్ల ద్వారా అనుసంధానిస్తామని, 1,56,000 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్లు నిర్మిస్తామని అవి ప్రభుత్వానికి హామీని ఇచ్చాయి. ఈ హామీల రెగ్యులేటర్‌ కోసమే ప్రాథమికంగా రూ. 1.2లక్షల కోట్ల పెట్టుబడి అవసరం. ఇప్పటికే పలు గ్యాస్ కంపెనీలు నిధుల సమీకరణ, హామీల అమలు దిశగా వెళ్ళిపోయాయి కూడా.

Image result for home cng gas pipe lineImage result for home cng gas pipe line

మరోవైపు గృహాలకు అవసరమైన గ్యాస్ ను సిలెండర్ల రూపంలో కాకుండా గ్యాస్ పైప్ లైన్ల ద్వారా ఇళ్ళకు అందించే విషయంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయని  సీఎన్‌జీ రిటైలర్స్ అంటున్నారు. ఇళ్ళలో పైప్ లైన్ల ద్వారా తక్కువ గ్యాస్‌నే వినియోగ దారులు ఉపయోగించుకుంటారని, ఇది తమకు నష్టం వాటిల్లే అంశమేనని మహా నగర్ గ్యాస్ ప్రతినిధి వాఖ్యానించారు. పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా గ్యాస్ వినియోగాన్ని పూర్తిగా  ఉపయోగించుకోవట్లేదు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో గ్యాస్ కంటే చవకగా బొగ్గు,  ఇంధన చమురు వంటివి ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. సీఎన్‌జీ (వెహికిల్స్ ) వ్యాపారం లేకుండా గృహ గ్యాస్ వినియోగ వ్యాపారం లాభసాటిగా ఉండదని గ్యాస్ కంపెనీలు పేర్కొంటున్నాయి. 
ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియమ్, భారత్ పెట్రోలియమ్ , ఆదానీ గ్యాస్, AG&P వంటి కంపెనీలు గ్యాస్ వ్యాపారంలో ఉన్నాయి. నగరాల్లో గ్యాస్ సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ (IGL), మహానగర్ గ్యాస్ (MGL ) వంటి కంపెనీలు ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి. 2030 తరువాత దేశంలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు కనుక రోడ్ల మీద ఉంటే.. గ్యాస్ కంపెనీలు కూడా పూర్తిగా రోడ్డున పడ్డట్టే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. 

Image result for gas companies logos in indiaImage result for gas companies logos in india