HDB ఫిన్ ఐపీఓకు గ్రే మార్కెట్లో ఊహించనంత ప్రీమియం..!

HDB ఫిన్ ఐపీఓకు గ్రే మార్కెట్లో ఊహించనంత ప్రీమియం..!

దేశంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం  HDFC బ్యాంక్ కు చెందిన HDB ఫిన్ గ్రే మార్కెట్లో అత్యధిక మార్కెట్ వాల్యూ కలిగి ఉంది. దేశంలోనే అత్యధిక నాలుగో వాల్యుబుల్ నాన్ బ్యాంకింగ్ దిగ్గజంగా HDB ఫిన్ అవతరించింది. గ్రే మార్కెట్లో ఈ సంస్థ వాల్యూయేషన్ దాదాపు రూ. 80,000 కోట్లకు పైగా చేరింది. గ్రే మార్కెట్లో HDB ఫిన్ షేర్లు రూ. 1,000 - 1,050 చొప్పున ట్రేడ్ అవుతున్నాయని ట్రేడ్ బ్రోకర్స్ మరియు మార్కెట్ నిపుణులు అంటున్నారు. కాగా ఈ సంస్థకు సంబంధించి HDFC బ్యాంక్ పబ్లిక్ ఇష్యూకు వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. కాగా నాన్ బ్యాంకింగ్ రంగంలోని బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ వాల్యూ రూ. 2.11 లక్షల కోట్లుగా ఉండగా, బజాజ్ ఫిన్ సర్వ్ మార్కెట్ వాల్యూ రూ. 1.34లక్షల కోట్లుగా ఉంది. ఇక HDB ఫిన్ మాతృ సంస్థ అయిన HDFC బ్యాంక్ మార్కెట్ వాల్యూయేషన్ రూ. 3.78 లక్షల కోట్లుగా ఉంది. HDFC బ్రాండ్ వల్ల, ఈ HDB ఫిన్ అన్‌లిస్టెడ్ షేర్లు గత రెండు రోజుల నుంచి హై వాల్యూమ్స్ లో ట్రేడ్ అవుతున్నాయని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి. ఈ స్టాక్ ప్రైస్ టు బుక్ వాల్యూ 11.5 రెట్లు పెరిగింది. ఇదే సమయంలో బజాజ్ ఫైనాన్స్ బుక్ వాల్యూమ్ 10 రెట్లు , బజాజ్ ఫిన్ సర్వ్ వాల్యూమ్ 5.9 రెట్లు మాత్రమే పెరగడం గమనార్హం. 

Image result for hdb fin
కార్ లోన్స్ , పర్సనల్ లోన్స్ ఇచ్చే HDB ఫిన్  ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్ళనున్నట్టు సమాచారం. ఈ సంస్థలో HDFC బ్యాంక్‌కు 95.53 శాతం వాటాలు ఉన్నాయి. రూ. 10,000 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా HDFC బ్యాంక్ HDB ఫిన్‌లోని వాటాలను అమ్మాలని యోచిస్తుంది. అందుకే HDB ఫిన్‌  ఇనిషీయల్ పబ్లిక్ ఆఫర్ (IPO) కు వెళ్లాలని నిర్ణయించింది. ఇక HDB ఫిన్‌లో HDB ఎంప్లాయిస్ వెల్ ఫేర్ ట్రస్ట్, మరియు HDBFS ఎంప్లాయిస్ వెల్ ఫేర్ ట్రస్ట్ వరుసగా 26.19 లక్షల షేర్లు, 19.22 లక్షల షేర్లను కలిగి ఉన్నాయి. అలాగే డిబెంచర్స్ ట్రస్టీ కంపెనీ అయిన విస్ట్రా ITCL  దాదాపు 15 లక్షల షేర్లను HDB ఫైనాన్షియల్స్ లో కలిగి ఉన్నాయి.  హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్(HNIs) కూడా HDB ఫిన్ పై ఆసక్తి చూపుతుండటం విశేషం. ఈ సంస్థ కోసం HDFC బ్యాంక్ పబ్లిక్ ఇష్యూకు వెళ్ళనుండటంతో వీరు ఒక్కో షేర్ ను రూ. 1,100-1,200 చొప్పున కొనుగోలు చేస్తున్నారని బ్రోకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంస్థ మీద ఇంత మక్కువ చూపడానికి కారణంగా వారు HDFC AMC, HDFC లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీల లాభాలను చూపుతున్నారు. అంతే కాకుండా గత 5 ఏళ్ళుగా HDFC బ్రాండ్ వాల్యూను కూడా HNIs పరిగణనలోకి తీసుకున్నారు. HDB ఫిన్ ప్రాఫిట్స్ కూడా గత నాలుగు సంవత్సరాల్లో మూడు రెట్లు పెరిగాయి. 2015 ఆర్ధిక సంవత్సరం (FY15) లో రూ. 350 కోట్లుగా ఉన్న లాభాలు, 2019 ఆర్ధిక సంవత్సరం కల్లా రూ. 1,153 కోట్లకు చేరాయి. ఇది కూడా కంపెనీని మరింత ఆకర్షణీయంగా మార్చిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం 2019 నాటికి రెవిన్యూ వృద్ధి 245శాతం పెరిగి రూ. 8,725 కోట్లకు చేరింది.2019 ఆర్ధిక సంవత్సరానికి గానూ  రిటర్న్ ఆన్ అసెట్స్ (RoA) 2.3 శాతంగా, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (NIM) , తక్కువ రుణ వ్యయాలు, ఈక్విటీ మీద రిటర్న్స్ 17.2శాతంగా ఉన్నాయి. మిగతా నాన్ బ్యాంకింగ్ సంస్థలు లిక్విడిటీ సమస్యలతో కునారిల్లుతున్నా.. HDB ఫిన్ మాత్రం అప్రతిహతంగా దూసుకెళ్తోంది. 
 



Most Popular