సెబీ కొత్త రూల్స్‌తో మ్యూచువల్ ఫండ్స్‌కు ముచ్చెమటలు 

సెబీ కొత్త రూల్స్‌తో మ్యూచువల్ ఫండ్స్‌కు ముచ్చెమటలు 

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు, సంస్థల అడ్డగోలు పెట్టుబడులకు కళ్లెం వేసేందుకు సెబీ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రధానంగా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌కు కఠిన నిబంధనలతో పాటు డిబెంచర్ల డిఫాల్ట్స్ అరికట్టేందుకు మరిన్ని ఆంక్షలను విధించింది సెబీ. తాను ఏర్పాటు చేసిన మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ కమిటీ సిఫార్సుల ప్రకారం అనేక మార్పులను చేపట్టింది సెబీ. సెప్టెంబర్ 2020 నుంచి అనేక కొత్త నిబంధనలను కూడా తీసుకురాబోతోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్.బి.ఎఫ్.సి) మరింత గడ్డు పరిస్థితులను తీసుకురాబోతున్నాయి. 

సెబీ చెబ్తున్న లెక్కల ప్రకారం ప్రస్తుతం డెట్ ఫండ్స్‌లో రూ. 13.24 లక్షల కోట్ల విలువైన అసెట్స్ నిర్వాహణలో ఉన్నాయి. వీటిల్లో రూ. 3.12 లక్షల కోట్లు ఎన్‌బిఎఫ్‌సిలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకే ఎక్స్‌పోజర్ ఉంది. 

ఈక్విటీ సహా వివిధ ఫండ్స్‌లో మొత్తం రూ.25.93 లక్షల కోట్లను మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 2020 నాటికి ఇవన్నీ కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 

మార్పులు

  • లిక్విడ్ ఫండ్స్ 

20 శాతం ఆస్తులను లిక్విడ్ సెక్యూరిటీస్‌లో ఉంచాలి. 
ఒకే రంగంలో పెట్టుబడిని 25 నుంచి 20 శాతానికి తగ్గించాలి. 

  • తనఖా షేర్లు

మొత్తం షేర్ క్యాపిటల్‌లో 20 శాతానికి మించి ప్రమోటర్లు తనఖా పెడితే సదరు సమాచారాన్ని బహిర్గత పరచాలి. 

  • షేర్లకు లోన్లు

ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రమోటర్లకు షేర్లను తనఖా పెట్టుకుని రూ.50 వేల కోట్ల వరకూ రుణాలు ఇచ్చారు. ఈ నిబంధనల్లో కూడా మార్పు ఉండాలి. ప్రస్తుతం రెండు రూపాయల విలువై షేర్లు కుదువ పెట్టుకుని ఒక్క రూపాయి రుణమిస్తున్నారు. దీన్ని నాలుగు రూపాయలకు పెంచబోతున్నారు. అంటే ఇకపై నాలుగు రూపాయల విలువైన షేర్లు పెట్టిన తర్వాతే ఒక్క రూపాయి వరకూ రుణం తీసుకోవచ్చు. 

జీ ఎంటర్‌టైన్మెంట్స్ ఉదంతం
మ్యూచువల్ ఫండ్ సంస్థలు - ప్రమోటర్ల మధ్య ఒప్పందాన్ని తాము ఎంత మాత్రమూ అంగీకరించబోమనే సెబీ ఛైర్మన్ త్యాగీ స్పష్టంగా చెప్పారు. 

రైట్ ఆఫ్ చేయలేరు
ప్రస్తుతం ఏదైనా డెట్ సాధనం ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ కంటే కిందికి దిగి వస్తే మేనేజర్లు తమ సొంత నిర్ణయాలతో వాటిని రైట్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇకపై అలాంటి చర్యలు కుదరవు.  సదరు ఇన్వెస్ట్‌మెంట్ పేపర్‌ను బూస్ట్ చేయడానికి లేదా పడేయడానికి సొంత ట్రేడ్స్, రైట్ ఆఫ్స్ వంటివి చేయడానికి కుదరదు. త్వరలో ఇందుకు సంబంధించిన యూనివర్సల్ ఫ్రేమ్ వర్క్ అందుబాటులోకి రాబోతోంది.