ఈ మిడ్‌ క్యాప్స్‌.. దూకుడెక్కువ!

ఈ మిడ్‌ క్యాప్స్‌.. దూకుడెక్కువ!

మార్కెట్లు హుషారుగా సాగుతున్న నేపథ్యంలో కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లు జోరందుకున్నాయి. వెరసి భారీ లాభాలతో మార్కెట్లను మించి సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో ఎన్‌బీఎఫ్‌సీ శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్, ఇన్‌ఫ్రా రంగ సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌, కెమికల్స్‌ సంస్థ రెయిన్‌ ఇండస్ట్రీస్‌, ఇండియాగేట్‌ బాస్మతి బియ్యం సంస్థ కేఆర్‌బీఎల్‌, గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్ తయారీ హెచ్‌ఈజీ లిమిటెడ్‌ చోటుచేసుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

శ్రీరామ్‌ సిటీ యూనియన్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9.6 శాతం దూసుకెళ్లి రూ. 1478కు చేరింది. ఇంట్రాడేలో రూ. 1550 వరకూ ఎగసింది. అయితే తొలుత ఒక దశలో రూ. 1308 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకడం గమనార్హం! గత నెల రోజుల సగటు 220 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 14,450 షేర్లు చేతులు మారాయి.

దిలీప్‌ బిల్డ్‌కాన్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7.6 శాతం దూసుకెళ్లి రూ. 473కు చేరింది. ఇంట్రాడేలో రూ. 480 వరకూ ఎగసింది. గత నెల రోజుల సగటు 44,630 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 99,000 షేర్లు చేతులు మారాయి.

రెయిన్‌ ఇండస్ట్రీస్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4 శాతం ఎగసి రూ.103కు చేరింది. ఇంట్రాడేలో రూ. 105-99 మధ్య ఊగిసలాడింది. గత నెల రోజుల సగటు 1.02 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1.03 లక్షల షేర్లు చేతులు మారాయి.

కేఆర్‌బీఎల్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 315ను తాకింది. ఇంట్రాడేలో రూ. 321-301 మధ్య ఊగిసలాడింది. గత నెల రోజుల సగటు 4,900 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 9,000 షేర్లు చేతులు మారాయి.

హెచ్‌ఈజీ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం పురోగమించి రూ. 1528కు చేరింది. ఇంట్రాడేలో రూ. 1552-1457 మధ్య ఊగిసలాడింది. గత నెల రోజుల సగటు 42,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 51,200 షేర్లు చేతులు మారాయి.