మార్కెట్లు మందగమనం! అయినా...ఈ 38స్టాక్స్ మాత్రం అప్ !!

మార్కెట్లు మందగమనం! అయినా...ఈ 38స్టాక్స్ మాత్రం అప్ !!

ఈ వారం దేశీయ మార్కెట్లు మందకోడిగా కదులుతున్నా.. మంగళ వారం నాటి సెషన్‌లో NSE లోని కొన్ని స్టాక్స్ మాత్రం హై పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. టెక్నికల్ ఛార్టుల్లో మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ (MACD) ని బట్టి చూస్తే.. NSE లోని 38 స్టాక్స్ రానున్న రోజుల్లో మంచి ర్యాలీని కొనసాగించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మార్కెట్లు రీబౌండ్ సంకేతాలు ఇవ్వనప్పటికీ.. ఈ స్టాక్స్ మంచి ఊపుమీద కనబడుతున్నాయని ఛార్ట్ ఎనలిస్టులు అంటున్నారు. మూమెంటమ్ ఇండికేటర్ బుల్లిష్ క్రాస్‌ఓవర్‌ను కనబరుస్తుందని, ఈ స్టాక్స్ మీద పాజిబుల్ అప్‌ సైడ్స్ కనబడుతున్నాయని ఛార్ట్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం.
NSEలోని కొన్ని స్టాక్స్ బలమైన ట్రేడింగ్ వాల్యూమ్స్‌ను కనబరుస్తున్నాయి. హిందాల్కో, NTPC, సన్ ఫార్మా, NCC, ఎస్కార్ట్స్, పెట్రోనాట్ LNG, మార్క్‌సన్స్ ఫార్మా, ఇగ్రాషీ మోటార్స్, TBZ, స్పెన్సర్స్ రిటైల్, ఒబెరాయ్ రియాల్టీ, హాత్ వే కేబుల్, L&T టెక్నాలజీ సర్వీసెస్ వంటివి టెక్నికల్ ఛార్టుల్లో బుల్లిష్ సిగ్నల్స్‌ను కనబరుస్తున్నాయి. 

Up 38 1
Up 38 2
ట్రేడ్ సెక్యూరిటీలు లేదా సూచికలలో ధోరణి తిరోగమనాలను సిగ్నలింగ్ చేయడానికి MACD ప్రసిద్ది చెందింది.  26-రోజుల మరియు 12-రోజుల ఘాతాంక కదిలే సగటుల మధ్య వ్యత్యాసాన్ని కొలిచే సాధనంగా MACDని పరిగణిస్తారు. ఒక స్టాక్స్ గత 9 రోజుల ట్రేడింగ్ మూవింగ్ సగటును సిగ్నల్ లైన్‌గా భావిస్తూ.. ఆయా స్టాక్స్‌ను కొనుగోలు లేదా అమ్మకం (BUY or SELL ) అవకాశాలను పరిశీలిస్తారు. ఈ సిగ్నల్‌ లైన్‌ను MACD అధిగమిస్తే...దీన్ని బుల్లిష్ సిగ్నల్‌గా భావించవచ్చు, అంటే ఆ స్టాక్ త్వరలో అప్‌ సైడ్ మూమెంట్ ఇస్తుందని తెలుస్తుంది.  సిగ్నల్‌ లైన్‌ కు కిందే MACD ఉంటే అది బేరిష్ నెస్‌ను ప్రతిబింబిస్తుందని అనుకోవచ్చు.  ఇదే ప్రాతిపదికన NSEలోని  16 స్టాక్స్ బేరిష్ ట్రెండ్‌ను చూపుతున్నాయి. వీటిలో అరబిందో ఫార్మా, టెక్ మహీంద్ర, మహానగర్ గ్యాస్ , UCO బ్యాంక్, SRF, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్  వంటివి ఉన్నాయి. ఆయా స్టాక్స్ రానున్న రోజుల్లో మరింత క్షీణతకు గురయ్యే అవకాశాలే ఎక్కువ అని ఛార్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. 
Down 68 1
Down 16 2

pic courtesy by: Economic Times
అయితే.. ఇక్కడ MACD సూచీని ఒంటరిగా చూడకూడదు. ఎందుకంటే ఇది ట్రేడింగ్ కాల్‌ తీసుకోడానికి సరిపోక పోవచ్చు. ఒక ఫండమెంటల్ ఎనలిస్టు  ఒకే మదింపు నిష్పత్తిని ఉపయోగించి "బై" లేదా "సెల్ " కాల్‌ను ఇవ్వలేడు. ట్రేడర్స్ స్టాక్స్ ఎంపిక సమయంలో ఒక్క MACD నే కాకుండా ఇతర సూచీలు అంటే.. స్ట్రెంత్ ఇండెక్స్ (RSI), బోలింగర్ బాండ్స్, ఫైబోనాక్సీ సరీస్, క్యాండిల్ స్టిక్స్ ప్యాట్రన్స్ ను సరిచూసుకోవాలని టెక్నికల్ ఎనలిస్టులు సూచిస్తున్నారు. అయితే నిఫ్టీ 11,625-11,850 పాయింట్ల మధ్య కదలాడితేనే.. ఈ స్టాక్స్ ర్యాలీని కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత రెండు సెషన్‌లలో నిఫ్టీ పూర్ పెర్‌ఫార్మెన్స్‌ను కనబరిచింది. మంగళవారం నాటి మార్కెట్లు ముగిసే నాటికి నిఫ్టీ 11,700 వరకూ వస్తే.. కొంత స్టాక్స్ లో బ్రేక్‌డౌన్ తగ్గుదల ఉండొచ్చని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వారం మొత్తం ఇన్వెస్టర్లు కొంత సంయమనం పాటిస్తే మేలని వారు సూచిస్తూ ఉండటం ఇక్కడ గమనార్హం. 
Disclaimer: పైన సూచించిన సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ నిపుణుల చేత ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');