ఎరిస్‌ జోష్‌- పిరమల్‌ డీలా

ఎరిస్‌ జోష్‌- పిరమల్‌ డీలా

ఎన్‌బీఎఫ్‌సీ శ్రీరామ్‌ కేపిటల్‌లో వాటాను విక్రయించనున్న వార్తలతో డైవర్సిఫైడ్‌ సంస్థ పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. కాగా.. మరోపక్క సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ప్రతిపాదించినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్‌ సంస్థ ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. దీంతో బలహీన మార్కెట్లో ఈ షేరు లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ 
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ప్రతిపాదించినట్లు తాజాగా ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ పేర్కొంది. ఈ అంశాన్ని జులై 3న నిర్వహించనున్న సమావేశంలో కంపెనీ బోర్డు చర్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ షేరు 2 శాతం ఎగసి రూ. 519 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 5 శాతం జంప్‌చేసి రూ. 534 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Related image

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌
నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ శ్రీరామ్‌ కేపిటల్‌లో తమకున్న మొత్తం 20 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా పేర్కొంది. ఇందుకుగల అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇందుకు నియంత్రణ సంస్థలు, బోర్డు, వాటాదారుల అనుమతులు లభించవలసి ఉన్నదని వివరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించనున్నట్లు తెలియజేసింది. కాగా.. కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్‌ 100 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెలువడిన వార్తలపై వివరణ ఇస్తూ.. ఇంతవరకూ బోర్డు లేదా ఏ ఇతర కమిటీల ముందుకు ఇలాంటి ప్రతిపాదన రాలేంటూ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 1871 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1974-1865 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');