పసిడి ధరలకు వివాదాల మెరుపు

పసిడి ధరలకు వివాదాల మెరుపు

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న రాజకీయ ఆందోళనలు బంగారం ధరలకు ప్రోత్సాహాన్నిస్తునాయి. దీంతో ఇటీవల బలపడుతూ వస్తున్న పుత్తడి ధరలు విదేశీ మార్కెట్లో మరింత స్పీడందుకున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1.52 శాతం(దాదాపు 22 డాలర్లు) జంప్‌చేసింది. 1440 డాలర్లకు చేరింది. ఇది ఆరేళ్ల గరిష్టంకాగా.. సోమవారం సైతం బంగారం ధరలు 0.6 శాతం బలపడటం గమనార్హం! ఇంతక్రితం 2013 సెప్టెంబర్‌లో మాత్రమే పసిడి ఫ్యూచర్స్‌ 1428 డాలర్ల స్థాయికి చేరాయి. కాగా.. ప్రస్తుతం కామెక్స్‌ స్పాట్‌ మార్కెట్లోనూ ఔన్స్‌ బంగారం 17 డాలర్లు ఎగసి 1436 డాలర్లను అధిగమించింది. ఇక వెండి ఔన్స్‌ నేటి ట్రేడింగ్‌లో 0.6 శాతం పుంజుకుని 15.55 డాలర్ల వద్దకు చేరింది. వెరసి జూన్‌లో సోమవారం వరకూ బంగారం ధరలు 8 శాతం ఎగశాయి. ఔన్స్‌ 70 డాలర్లవరకూ లాభపడింది.

ఏం జరిగిందంటే?
గతవారం అమెరికన్‌ నేవీ డ్రోన్‌ను ఇరాన్‌ మిలటరీ వర్గాలు కూల్చివేసిన వార్తలతో బంగారం ధరలు ఊపందుకున్నాయ్‌. ఒక దశలో ఇరాన్‌పై సైనికదాడికి అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సిద్ధపడినట్లు వెలువడిన వార్తలు దీనికి కారణమైనట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. తమపై మరిన్ని ఆంక్షలు విధిస్తే అమెరికాతో దౌత్య సంబంధ పరిష్కారాలకు తెరపడుతుందని ఇరాన్‌ తాజాగా వ్యాఖ్యానించినట్లు వెలువడ్డ వార్తలు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్‌ను మరింత పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Image result for trump and jinping

పసిడికి మెరుపు
రాజకీయ అనిశ్చితులు.. ఆర్థిక మందగమనం తదితర సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అటు కేంద్ర బ్యాంకులు, ఇటు ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడిగా బంగారాన్ని భావించే సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల పసిడికి డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. మరోవైపు 10ఏళ్ల కాలపు యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 2016 నవంబర్‌ తదుపరి 2 శాతం దిగువకు చేరడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్‌ బలహీనపడటం, స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వంటి అంశాలు పసిడికి గిరాకీని పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు ఇటీవల పెరిగాయి. దీంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు ఇవ్వగా, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సహాయక ప్యాకేజీలను తెరమీదకు తీసుకువచ్చాయి. ఈ అన్ని అంశాలు ఇటీవల పసిడికి మెరుపునిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

దేశీయంగా జోరు
దేశీయంగా ఎంసీఎక్స్‌లో పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర ప్రస్తుతం 1.2 శాతం ఎగసి రూ. 34,845 వద్ద కదులుతోంది. వెండి జులై ఫ్యూచర్స్‌ కేజీ 0.5 శాతం బలపడి రూ. 38,270కు చేరింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');