ఎస్‌బీఐ లైఫ్‌- వెల్‌స్పన్‌ కార్ప్‌ వీక్‌

ఎస్‌బీఐ లైఫ్‌- వెల్‌స్పన్‌ కార్ప్‌ వీక్‌

విదేశీ భాగస్వామ్య సంస్థ వాటాను విక్రయించనున్న వార్తలతో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించిన నేపథ్యంలో సా పైపుల దిగ్గజం వెల్‌స్పన్‌ కార్ప్‌ కౌంటర్లోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
విదేశీ భాగస్వామి బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌ తమ వాటాలో 2.5 శాతం ఈక్విటీని విక్రయించనున్నట్లు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేర్కొంది. షేరుకి రూ. 650 ధరలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 2.5 కోట్ల షేర్లను విక్రయించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. ఇది సోమవారం ధరతో పోలిస్తే 8.5 శాతం డిస్కౌంట్‌కాగా.. ఆఫర్‌ నేడు(25న) ప్రారంభంకానుంది. రిటైలర్లకు 26న వాటా విక్రయాన్ని చేపట్టనుంది. తద్వారా రూ. 1625 కోట్లు సమకూర్చుకునే వీలుంది. వీలుంది. మార్చికల్లా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌కు 7.7 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేరు 4 శాతం పతనమై రూ. 682 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 672 వరకూ నీరసించింది.

Image result for welspun corp ltd

వెల్‌స్పన్‌ కార్ప్‌
సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వెల్‌స్పన్‌ కార్ప్‌ పేర్కొంది. దీనిలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 135 ధర మించకుండా 2.89 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు జులై 5 రికార్డ్‌ డేట్‌కాగా.. రూ. 390 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వివరించింది. అయితే బైబ్యాక్‌ ధర నిరాశపరచడంతో ఈ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో వెల్‌స్పన్‌ కార్ప్‌ షేరు 2.2 శాతం క్షీణించి రూ. 137 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 135 వరకూ జారింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');