నష్టాలతో షురూ- ఐటీ, ఫార్మా వీక్‌

నష్టాలతో షురూ- ఐటీ, ఫార్మా వీక్‌

బలహీన విదేశీ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. తదుపరి అమ్మకాలు పెరగడంతో నష్టాలు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 114 పాయింట్లు క్షీణించి 39,009కు చేరగా.. నిఫ్టీ సైతం 33 పాయింట్ల వెనకడుగుతో 11,666 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం జపాన్‌లో జరగనున్న జీ20 దేశాల సమావేశాలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వాణిజ్య వివాద పరిష్కార దిశగా చర్చలు చేపట్టనున్నట్లు అమెరికన్‌ ప్రెసిడెంట్ ట్రంప్‌ గత వారాంతాన ప్రకటించారు. అయితే చర్చలు ఫలవంతంకావడంపై నెలకొన్న సందేహాలు మార్కెట్లను దెబ్బతీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో సోమవారం అమెరికా, యూరప్‌ అటూఇటుగా ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు నేలచూపుతో కదులుతున్నాయి. 

రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1.3-0.5 శాతం స్థాయిలో బలహీనపడగా.. రియల్టీ 0.5 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, జీ, ఇన్ఫ్రాటెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్, హీరోమోటో, గ్రాసిమ్, టీసీఎస్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి. అయితే వేదాంతా, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐవోసీ, ఎంఅండ్‌ఎం, ఆర్‌ఐఎల్‌ 1.5-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.

ఐఆర్‌బీ డౌన్‌
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో ఐఆర్‌బీ, ఆర్‌పవర్‌, సీజీ పవర్‌, మదర్‌సన్, సుజ్లాన్‌, టీవీఎస్‌ మోటార్, హావెల్స్‌, కేడిలా 6-2 శాతం మధ్య పతనంకాగా... ఐఎఫ్‌సీఐ, మణప్పురం, టొరంట్‌ పవర్‌, ఆర్‌ఈసీ, ఉజ్జీవన్‌, హెచ్‌పీసీఎల్‌, ముత్తూట్‌, బీఈఎంఎల్‌ 4.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌, గోద్రెజ్‌, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి.

చిన్న షేర్లు డీలా
మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలదే పైచేయిగా ఉంది. ప్రస్తుతం బీఎస్ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.15 శాతం బలహీనపడింది. ఇప్పటివరకూ 707 షేర్లు నష్టపోగా.. 669 లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో గాయత్రి, పోకర్ణ, హెచ్‌ఎంవీఎల్‌, తాన్లా, ఈరోస్‌, సింటెక్స్‌, మెక్‌లాయిడ్‌, కుషాల్‌, విండ్‌సర్‌ తదితరాలు 9-5.5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');