నేలచూపుతోనే- మెటల్‌, రియల్టీ డౌన్‌

నేలచూపుతోనే- మెటల్‌, రియల్టీ డౌన్‌

గత వారం ఆటుపోట్ల మధ్య నేలచూపులతో కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి అదే బాటలో నడిచాయి. అయితే స్వల్ప స్థాయిలోనే  హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఆద్యంతం కన్సాలిడేషన్‌ దిశలో సాగి చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 72 పాయింట్లు క్షీణించి 39,123 వద్ద నిలిచింది. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11,700 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11754 వద్ద గరిష్టాన్నీ, 11670 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ట్రేడింగ్ ప్రారంభంలో 39,300 వరకూ ఎగసిన సెన్సెక్స్‌ తదుపరి 39,022వరకూ డీలాపడింది. ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమై తదుపరి అధిక సమయం అమ్మకాలతో నీరసించాయి.

ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్, రియల్టీ, ఆటో రంగాలు 1.3-0.5 శాతం మధ్య వెనకడుగు వేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 0.25 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐషర్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, జీ, వేదాంతా, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా, డాక్టర్‌ రెడ్డీస్ 3.4-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే యూపీఎల్‌ 5.4 శాతం జంప్‌చేయగా, యస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌, ఐబీ హౌసింగ్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఇండస్‌ఇండ్ 1.6-0.7 శాతం మధ్య ఎగశాయి. 

జైన్‌, సుజ్లాన్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఆర్‌పవర్ 14 శాతం, గ్లెన్‌మార్క్‌ 8 శాతం చొప్పున కుప్పకూలగా.. హెక్సావేర్‌, టీవీ 18, ఐజీఎల్‌, పీసీ జ్యువెలర్స్‌, జిందాల్‌ స్టీల్‌, మదర్‌సన్‌, ఐఎఫ్‌సీఐ, కేడిలా హెల్త్‌ 5-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క జైన్‌ ఇరిగేషన్ 14 శాతం, సుజ్లాన్‌ 10 శాతం చొప్పున దూసుకెళ్లగా.. దివాన్‌ హౌసింగ్, ఎన్‌బీసీసీ, అదానీ పవర్‌, బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, పిరమల్‌, లుపిన్‌ 7.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక రియల్టీ కౌంటర్లలో సన్‌టెక్‌, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌ 3.4-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

మిడ్‌ క్యాప్స్‌ డీలా
మార్కెట్లు కన్సాలిడేట్‌ అయిన నేపథ్యంలో మిడ్‌ క్యాప్స్‌లో అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.3-0.15 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1455 నష్టపోగా.. 1057 లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల వెనకడుగు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 731 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 446 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గురువారం(20న) సైతం ఎఫ్‌పీఐలు రూ. 438 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 1241 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');