జేఎంసీ- సీజీ.. లాభాల 'పవర్‌ 

జేఎంసీ- సీజీ.. లాభాల 'పవర్‌ 

తాజాగా రూ. 514 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క ముంబైలోని భూమిని విక్రయించినట్లు వెల్లడించడంతో సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

జేఎంసీ ప్రాజెక్ట్స్‌
మొత్తం రూ. 514 కోట్ల విలువైన కాంట్రాక్టులు తాజాగా లభించినట్లు కల్పతరు గ్రూప్‌ అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్‌ పేర్కొంది. వీటిలో దేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాల నుంచి రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకుగాను రూ. 295 కోట్ల ఆర్డర్లను పొందినట్లు తెలియజేసింది. ఇదే విధంగా దేశ తూర్పు ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 112 కోట్ల విలువైన కాంట్రాక్టును సంపాదించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా ఇన్‌స్టిట్యూషనల్‌ బిల్డింగ్‌ నిర్మాణం కోసం ఇదే ప్రాంతం నుంచి రూ. 107 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జేఎంసీ ప్రాజెక్ట్స్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 133కు చేరింది. గత ఆరు నెలల్లో ఈ షేరు 60 శాతం ర్యాలీ చేయడం విశేషం!

Image result for CG Power and Industrial Solutions

సీజీ పవర్‌
కంపెనీ కార్యకలాపాలకు కీలకంకాని ముంబైలోని భూమిని విక్రయించినట్లు సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ తెలియజేసింది. ఎవీ రియల్‌ ఎస్టేట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు కంజూర్‌మార్గ్‌లోని 13 ఎకరాల భూమిని విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం  ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ యూనిట్‌ ఉన్న ఈ భూమి విక్రయ విలువను రూ. 499 కోట్లుగా తెలియజేసింది. 2019 డిసెంబర్‌లోగా డీల్‌ను పూర్తిచేయనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.5 శాతం లాభపడి రూ. 29.5కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 31 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');