జైన్‌ ఇరిగేషన్‌.. ఏం జరిగిందంటే?

జైన్‌ ఇరిగేషన్‌.. ఏం జరిగిందంటే?

సూక్ష్మ నీటిపారుదల పరికరాలు, అగ్రి బిజినెస్‌ సంస్థ.. జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ కౌంటర్‌ రెండు రోజులుగా దూకుడు చూపుతోంది. ఇటీవల కంపెనీ షేరు ధర భారీగా పతనమైన నేపథ్యంలో జైన్‌ ఇరిగేషన్‌ యాజమాన్యం ఇచ్చిన వివరణ ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో  గత రెండు రోజుల్లో 72 శాతం జంప్‌చేసిన ఈ షేరు తాజాగా ఎన్‌ఎస్‌ఈలో 17 శాతం దూసుకెళ్లింది. రూ. 29 వద్ద ట్రేడవుతోంది. ఇతర వివరాలు చూద్దాం..

డెరివేటివ్స్‌ నుంచి ఔట్‌
జూన్‌ సిరీస్‌తో జైన్‌ ఇరిగేషన్‌ షేరుని డెరివేటివ్ విభాగం నుంచి తప్పిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే  పేర్కొంది. ఈ బాటలో జెట్‌ ఎయిర్‌వేస్‌సహా 34 సెక్యూరిటీలలో డెరివేటివ్‌ కాంట్రాక్టులను నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్ కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ను A- నుంచి BBBకు దిగువముఖంగా సవరించింది. మైక్రో ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ విభాగం నుంచి వసూళ్లు, ధరలు మందగించడంతో జైన్‌ లిక్విడిటీ ప్రొఫైల్‌ బలహీనపడినట్లు ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలు పెరగడం, రుణ భారం వంటి అంశాలను రేటింగ్‌ సవరణలో పరిగణించినట్లు తెలియజేసింది. వీటికితోడు రుణ చెల్లింపుల్లో విఫలమయ్యే అవకాశమున్నట్లు మార్కెట్లో వినిపించిన వదంతులు సైతం జైన్‌ ఇరిగేషన్‌ కౌంటర్లో భారీ అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో మే 30.. జూన్‌ 19 మధ్య జైన్‌ ఇరిగేషన్‌ షేరు 64 శాతం పడిపోయింది. వెరసి ఈ నెల 20న జైన్‌ ఇరిగేషన్‌ షేరు రూ. 16.30కు పడిపోయింది. ఇది 15ఏళ్ల కనిష్టంకాగా.. 2004 ఆగస్ట్‌ స్థాయికి చేరింది!

ఫండమెంటల్స్‌ కారణంకాదు
షేరు పతనానికి కంపెనీ ఫండమెంటల్స్‌ కారణంకాదని జైన్‌ ఇరిగేషన్‌ యాజమాన్యం పేర్కొంది. ఎఫ్‌అండ్‌వో నుంచి తొలగించడానికితోడు రుణ చెల్లింపులపైనా పెరిగిన వదంతులు దీనికి కారణంకావచ్చంటూ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అన్ని ప్రధాన బిజినెస్‌లనూ వాటి అంతర్గత విలువ ఆధారంగా పటిష్టంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా రూ. 2,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలియజేసింది. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా అన్ని విభాగాలనూ లాభదాయకంగా నిర్వహించే బాటలో సాగుతున్నట్లు వివరించింది. తనఖా ఉంచిన షేర్ల విషయంలోనూ రుణదాతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేపడుతున్నట్లు వెల్లడించింది. 

కొసమెరుపు
ఇటీవల 72 శాతం ర్యాలీ చేసినప్పటికీ జైన్‌ ఇరిగేషన్‌ షేరు గతేడాది జూన్‌ 22న సాధించిన ఏడాది గరిష్టం రూ. 94.50 ధరతో పోలిస్తే.. ఇప్పటికీ 70 శాతం నష్టపోయింది. కాగా.. 2010 ఆగస్ట్‌ 9న జైన్‌ ఇరిగేషన్‌ షేరు రూ. 252 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం!Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');