ప్లస్‌లో.. పిరమల్‌- మ్యాక్స్‌

ప్లస్‌లో.. పిరమల్‌- మ్యాక్స్‌

పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ స్థాయిలో ఇన్వెస్ట్‌ చేయనున్న వార్తలతో దేశీ డైవర్సిఫైడ్‌ సంస్థ పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క అనుబంధ సంస్థ మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 49 శాతం వాటా కొనుగోలును రేడియంట్‌ లైఫ్‌ కేర్‌, పీఈ సంస్థ కేకేఆర్‌ అండ్‌ కో పూర్తిచేసినట్లు వెల్లడించండంతో మ్యాక్స్‌ ఇండియా కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌
పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులకుగాను జపనీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ నిర్వహిస్తున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఫైనాన్షియల్‌ అనుబంధ సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్‌ 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హోల్‌సేల్‌, కార్పొరేట్‌ రుణ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించే పిరమల్‌ గ్రూప్‌ ఫైనాన్షియల్‌ విభాగంలో విజన్‌ ఫండ్‌ ద్వారా సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో పిరమల్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 1958 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1988ను సైతం అధిగమించింది.

Related image

మ్యాక్స్‌ ఇండియా
మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌లో 49 శాతం వాటా విక్రయం పూర్తయినట్లు మ్యాక్స్‌ ఇండియా తెలియజేసింది. విలీన సంస్థలో 4.99 శాతం వాటాకుగాను ప్రమోటర్లకు ముందస్తుగా రూ. 361 కోట్లు లభించినట్లు మ్యాక్స్‌ ఇండియా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మ్యాక్స్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.5 శాతం బలపడి రూ. 66 వద్ద ట్రేడవుతోంది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');