ఐనాక్స్‌ విండ్- లుపిన్‌.. లాభాల్లో

ఐనాక్స్‌ విండ్- లుపిన్‌.. లాభాల్లో

గుజరాత్‌లో కామన్‌ పవర్‌ ఇవాక్యుయేషన్‌ సౌకర్యాలను ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఐనాక్స్ విండ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోపక్క విదేశీ రీసెర్చ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్‌ షేరు రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఐనాక్స్ విండ్‌
గుజరాత్‌, భుజ్‌ జిల్లాలోని దయాపార్‌ వద్ద ఏర్పాటు చేసిన విండ్‌ పార్క్‌లో కామన్‌ పవర్‌ ఇవాక్యుయేషన్‌ సిస్టమ్స్‌ను ప్రారంభించినట్లు సమీకృత పవన విద్యుత్‌ సొల్యూషన్స్‌ అందించే ఐనాక్స్ విండ్‌ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా 220 కేవీ సబ్‌స్టేషన్‌, 220 కేవీ డబుల్‌ సర్క్యూట్‌ ట్రాన్స్‌మిషన్‌లైన్‌సహా సంబంధిత మౌలిక సదుపాయాలను ఏర్పాటైనట్లు తెలియజేసింది. తద్వారా 600 మెగావాట్ల పవర్‌ ఇవాక్యుయేషన్‌కు వీలుంటుందని వివరించింది. దీంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ బోర్డుల నుంచి గెలుచుకునే 2-3.3 మెగావాట్ల విండ్‌ టర్బయిన్ల ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశముంటుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐనాక్స్‌ విండ్ షేరు దాదాపు 3 శాతం ఎగసి రూ. 72 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 73 వరకూ ఎగసింది. 

Related image

లుపిన్‌ లిమిటెడ్‌
హెల్త్‌కేర్‌ దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌ షేరుకి విదేశీ రీసెర్చ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్‌.. కొనుగోలు చేయవచ్చు(బయ్) అంటూ రేటింగ్‌ను ప్రకటించింది. గతంలో అండర్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌తో ఇచ్చిన రూ. 800 టార్గెట్‌ ధరను సైతం రూ. 860కు పెంచింది. మరోవైపు జపనీస్‌ బ్రోకింగ్‌ దిగ్గజం నోమురా సైతం లుపిన్‌ షేరుకి బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొనడంతోపాటు తాజాగా రూ. 1017 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ఈ నేపథ్యంలో లుపిన్‌ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం ఎగసి రూ. 733 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 737 వరకూ పెరిగింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');