ఇమామీ- గ్లెన్‌మార్క్‌.. అమ్మకాల దెబ్బ

ఇమామీ- గ్లెన్‌మార్క్‌.. అమ్మకాల దెబ్బ

పలు బ్లాక్‌డీల్స్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఊపిరి సంబంధ వ్యాధుల చికిత్సకు వినియోగించగల ఎన్‌డీఏ.. ర్యాల్ట్రిస్‌(నాజల్‌ స్ప్రే)కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించడంతో దేశీ హెల్త్‌కేర్‌ సంస్థ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్‌ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం.. 

ఇమామీ లిమిటెడ్‌
పలు బ్లాక్‌డీల్స్‌ ద్వారా ఇమామీ లిమిటెడ్‌ ఈక్విటీలో 8.3 శాతం వాటా చేతులు మారినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల డేటా తాజాగా వెల్లడించింది. ఈ డీల్స్‌ ద్వారా రూ. 275 సగటు ధరలో 3.7 కోట్ల షేర్లు ట్రేడైనట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ. 1022 కోట్లుకాగా.. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఇమామీ లిమిటెడ్‌ షేరు 5 శాతం పతనమై రూ. 276 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 272 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. గత త్రైమాసికంలో ఇమామీ లిమిటెడ్‌లో ప్రమోటర్లు 10 శాతం వాటాను విక్రయించినట్లు పరిశ్రమ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

Image result for glenmark pharmaceuticals

గ్లెన్‌మార్క్‌ ఫార్మా
కంపెనీ అభివృద్ధి చేసిన ఎన్‌డీఏ.. ర్యాల్ట్రిస్‌పై యూఎస్‌ఎఫ్‌డీఏ కంప్లీట్‌ రెస్పాన్స్‌ లెటర్‌(సీఆర్‌ఎల్‌)ను జారీ చేసినట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా వెల్లడించింది. ఇందుకు దాఖలు చేసిన అప్లికేషన్‌(డీఎంఎఫ్‌)లో లోటున్నట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది. అయితే డెఫీషియన్సీ అంశంపై స్పష్టతలేదని తెలియజేసింది. ఇందుకు తగిన చర్యలను చేపట్టడం ద్వారా రానున్న 6-9 నెలల్లో ఈ సమస్యను పరిష్కరించుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. కాగా.. మరోపక్క బ్రెజిల్‌లో ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు వినియోగించగల ఔషధాల అభివృద్ధికి ఫార్మా దిగ్గజం నోవర్తిస్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరు 6 శాతం పతనమై రూ. 470 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 467 వద్ద ఆరేళ్ల కనిష్టాన్ని చవిచూసింది. 2013 ఏప్రిల్‌ తదుపరి షేరు కనిష్టానికి చేరింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');