మార్కెట్‌ ఫ్లాట్‌- ఆటో స్కిడ్‌

మార్కెట్‌ ఫ్లాట్‌- ఆటో స్కిడ్‌

మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 45 పాయింట్లు పుంజుకుని 39,239కు చేరగా.. నిఫ్టీ సైతం 12 పాయింట్ల లాభంతో 11,736 వద్ద ట్రేడవుతోంది. ఈ నెలాఖరున జపాన్‌లో జరగనున్న జీ20 దేశాల సమావేశాలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వాణిజ్య వివాద పరిష్కార దిశగా చర్చలు చేపట్టనున్నట్లు అమెరికన్‌ ప్రెసిడెంట్ ట్రంప్‌ గత వారాంతాన ప్రకటించారు. మరోవైపు వచ్చే నెలలో నిర్వహించనున్న పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు ఉన్నట్టుండి బలపడ్డాయి. ఈ నేపథ్యంలో గత వారం అమెరికా మార్కెట్లు 2.5 శాతం ఎగసినప్పటికీ దేశీ మార్కెట్లు స్వల్ప వెనకడుగుతో నిలిచాయి. 

బ్యాంక్స్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగాలు 0.3 శాతం స్థాయిలో బలపడగా., ఆటో 0.8 శాతం వెనకడుగు వేసింది. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఇండస్‌ఇండ్‌, యూపీఎల్‌, బ్రిటానియా, టైటన్‌, గ్రాసిమ్‌, ఎయిర్‌టెల్‌, యస్ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 2.6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే బజాజ్‌ ఆటో, హీరో మోటో, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, గెయిల్‌, ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా 2.3-0.7 శాతం మధ్య నీరసించాయి.  

సుజ్లాన్‌ జోరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో సుజ్లాన్‌ 11 శాతం జంప్‌చేయగా.. పిరమల్‌, సీజీ పవర్‌, దివాన్‌ హౌసింగ్‌, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, లుపిన్‌, బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, ఆర్‌పవర్‌ 4-4-2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు మదర్‌సన్, హెక్సావేర్‌, జెట్‌ ఎయిర్‌, చెన్నై పెట్రో, గ్లెన్‌మార్క్‌, పీవీఆర్‌, ఉజ్జీవన్‌, టీవీఎస్‌ మోటార్ 4.25-2 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లకు కొద్దిపాటి డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం బీఎస్ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం బలపడింది. ఇప్పటివరకూ 814 షేర్లు లాభపడగా.. 628 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఎమ్‌కే, తంగమాయిల్‌, ఎన్‌ఏసీఎల్‌, శర్దా, జేకే అగ్రి, జేఅండ్‌కే బ్యాంక్‌, ఐఎఫ్‌బీ, కామధేను, కెల్టన్‌ టెక్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ తదితరాలు 16-5.5 శాతం మధ్య దూసుకెళ్లాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');