ఇరాన్‌ టెన్షన్‌- యూఎస్‌ వీక్‌

ఇరాన్‌ టెన్షన్‌- యూఎస్‌ వీక్‌

ఇరాన్‌తో వివాదాలు పెరుగుతున్న కారణంగా శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. అయితే ఈ నెల 27-29న జపాన్‌లో జరగనున్న జీ20 దేశాల సమావేశంలో జిన్‌పింగ్‌తో అదనపు సమయం చర్చలు చేపట్టనున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో గురువారం మార్కెట్లు ర్యాలీ చేయడంతో ఈ జోష్‌ వారాంతాన తొలి దశలో కనిపించింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలో ఎస్‌అండ్‌పీ 2,964 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. తదుపరి ఇరాన్‌ టెన్షన్ల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి పెరిగి మార్కెట్లు వెనకడుగు వేశాయి. చివరికి వారాంతాన డోజోన్స్‌ 34 పాయింట్లు(0.15 శాతం) క్షీణించి 26,719కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 4 పాయింట్లు(0.1 శాతం) నీరసించి 2,950 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం 19 పాయింట్ల(0.2 శాతం) నష్టంతో 8,032 వద్ద స్థిరపడింది. అయితే వారం మొత్తం చూస్తే ఎస్‌అండ్‌పీ 2 శాతం, నాస్‌డాక్‌ 3 శాతం చొప్పున పుంజుకున్నాయి! కాగా.. ఈ ఏడాది తొలి అర్థభాగంలో ఎస్‌అండ్‌పీ దాదాపు 18 శాతం లాభపడటం ద్వారా 1997 తదుపరి రికార్డ్‌ నెలకొల్పడం విశేషం! 

Image result for carmax inc

చిప్‌ కౌంటర్లు డౌన్‌
అనుమతి లేకుండా విడిభాగాలను కొనుగోలు చేయరాదంటూ ఐదు చైనీస్‌ కంపెనీలపై యూఎస్‌ వాణిజ్య శాఖ తాజాగా నిషేధాన్ని విధించడంతో చిప్‌ తయారీ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. మైక్రాన్‌ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్‌, జైలింక్స్‌ 3-2 శాతం మధ్య పతనమయ్యాయి. సీవోవో బిల్‌ రెడీ రాజీనామా చేయనున్నట్లు వెల్లడించడంతో పేపాల్‌ హోల్డింగ్స్‌ 2.2 శాతం క్షీణించింది. కాగా.. ఫలితాలు అంచనాలను మించడంతో యూజ్‌డ్‌ వాహన విక్రయాల సంస్థ కార్‌మ్యాక్స్‌ ఇంక్ 3.2 శాతం ఎగసింది. 2019 గైడెన్స్‌ తదుపరి బ్రోకింగ్‌ సంస్థలు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో కార్నివాల్‌ కార్ప్‌ 4.4 శాతం పతనమైంది.  

Related image

ఆసియా మిశ్రమం
అమెరికా, చైనా మధ్య జీ20 సమావేశాలలో వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం కుదరవచ్చన్న అంచనాల నేపథ్యంలో శుక్రవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు స్వల్పంగా బలహీనపడ్డాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే 0.25-0.25 శాతం మధ్య క్షీణించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. తైవాన్‌, సింగపూర్‌ 0.45 శాతం స్థాయిలో నష్టపోగా.. కొరియా, హాంకాంగ్‌ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. మిగిలిన మార్కెట్లలో ఇండొనేసియా, థాయ్‌లాండ్‌ నామమాత్రంగా నష్టపోగా.. జపాన్ స్వల్ప లాభంతో కదులుతోంది. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 96.11 వద్ద 3 నెలల  కనిష్టానికి చేరగా.. యూరో 1.137 వద్ద 3 నెలల గరిష్టానికి చేరింది. జపనీస్‌ యెన్‌ 107.33 వద్ద 5 నెలల గరిష్టాన్ని తాకింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');