ఇండియామార్ట్‌ ఐపీవో 24న

ఇండియామార్ట్‌ ఐపీవో 24న

ఇండియామార్ట్‌.కామ్‌ పేరుతో బిజినెస్‌ ప్రొడక్టులు, సర్వీసులు నిర్వహించే ఆన్‌లైన్‌ సంస్థ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఆన్‌లైన్‌లో బీటూబీ విక్రయాలకు అతిపెద్ద సంస్థ అయిన ఇండియామార్ట్‌ ఇష్యూ ఈ నెల 24న(సోమవారం) ప్రారంభమై 26న(బుధవారం) ముగియనుంది. ఇష్యూకి ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 970-973కాగా.. దాదాపు 48.9 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 475 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు దినేష్ చంద్ర అగర్వాల్‌, బ్రిజేష్‌ కుమార్‌ అగర్వాల్‌ 14.3 లక్షల షేర్లను విక్రయించనున్నారు. కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన ఇంటెల్‌ కేపిటల్‌(మారిషస్‌) అమెడ్యూస్‌ ఐవీ తదితర సంస్థలు 34.6 లక్షల షేర్లవరకూ అమ్మకానికి పెట్టనున్నాయి. కంపెనీ ప్రధానంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు సేవలు అందిస్తోంది. 2019 మార్చికల్లా కంపెనీలో నమోదైన వినియోగదారుల సంఖ్య 82.7 మిలియన్లుకాగా.. 5.5 మిలియన్‌ సరఫరాదారులు రిజిస్టర్‌ అయ్యారు.

యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌
ఐపీవో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఇండియామార్ట్‌ శుక్రవారం రూ. 213 కోట్లు సమీకరించింది. షేరుకి 973 ధరలో 15 యాంకర్‌ సంస్థలకు దాదాపు 22 లక్షల షేర్లను కేటాయించింది. కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐలతోపాటు.. బిర్లా మ్యూచువల్‌ ఫండ్‌, హార్న్‌బిల్‌ కేపిటల్‌ తదితరాలున్నాయి.



Most Popular