86శాతం పడిపోయిన NSE స్టాక్స్..! మరి దేనిలో పెట్టుబడులు సురక్షితం?

86శాతం పడిపోయిన NSE స్టాక్స్..! మరి దేనిలో పెట్టుబడులు సురక్షితం?

మార్కెట్లలో ప్రతి మేజర్ కరెక్షన్‌ వల్ల మదుపర్ల లాభాలను దూరం చేస్తూనే వచ్చాయి. గత జూన్ 4 వ తేదీ నాడు BSE బెంచ్ మార్క్ సూచీలు ఆల్ టైం గరిష్టంగా 40,312 పాయింట్ల వద్దకు చేరాయి. కానీ ఆ తరువాత బెంచ్ మార్క్ సూచీలు 3 నుండి 6 శాతం పడిపోయాయి. BSE స్మాల్ , మిడ్ క్యాప్ సూచీలు దాదాపు 30శాతం క్షీణతను ఎదుర్కొన్నాయి. గత 2018 జనవరి నాటి నుండి NSE లోని సుమారు 86శాతం స్టాక్స్ ఇన్వెస్టర్ల సంపదను తుడిచి పెట్టేశాయి. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుండి చూస్తే... అత్యధికంగా నష్టపోయిన షేర్ .. రిలయన్స్ కమ్యునికేషన్స్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. రిలయన్స్ కమ్యునికేషన్స్ స్టాక్స్ దాదాపు 90శాతం నష్టపోయాయి. అలాగే అత్యధికంగా పెరిగిన షేర్ గా అవాస్ ఫైనాన్షియర్స్ నిలిచింది. ఈ స్టాక్స్ దాదాపు 74శాతం పెరిగి మదుపర్లకు లాభాలను అందించింది. 
మరి మదుపర్లు దేనిలో పెట్టుబడులు పెట్టడం సురక్షితం..? ఈక్విటీస్ కాకుండా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు కాస్త రిస్క్ అయినప్పటికీ.. ఈ సంవత్సరం ఆరంభం నుండి ఇవి మంచి పురోగతిని చూపిస్తున్నాయి. గోల్డ్ మీద పెట్టుబడులు సాధారణంగానే ఉన్నాయి. వచ్చే లాభాల సమయం కోసం ప్రస్తుతం సంధి కాలం నడుస్తుందని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
3 ఏళ్ళ లోపు పెట్టుబడుల (స్వల్పకాలికం) కోసం అయితే.. మీ పెట్టుబడుల్లో 65శాతం డెట్ ఫండ్ల మీద, 30శాతం ఈక్విటీస్ మీద, మిగిలిన 5శాతం బంగారం మీద పెట్టుబడులు సురక్షితమని ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్ సూచిస్తోంది. అలాగే 3 సంవత్సరాలు మరియు ఆపైన కాలం(దీర్ఘకాలికం) కోసం పెట్టుబడులకు 60శాతం ఈక్విటీస్ మీద, 40శాతం డెట్ ఫండ్ల మీద పెట్టుబడులు పెట్టమని ఆనంద్ రాఠీ సూచిస్తుంది. 
ఇక యంగ్ ఇన్వెస్టర్లు అయితే.. వారికి కుటుంబ బాధ్యతలు , రుణాలు వంటివి ఉండవు కనుక వీరు రిస్కీ బెట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చని కోటక్ సెక్యూరిటీస్ సూచిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం తమ వద్ద ఉన్న వాటిలో 70-80 శాతం స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ ఈక్విటీస్ మీద, 10 నుండి 20శాతం గోల్డ్ మీద  పెట్టుబడులు లాభదాయకమని కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ పేర్కొంది. ఇన్వెస్టర్ల వయసు కూడా పెట్టుబడుల మీద ప్రభావం చూపుతోందని కోటక్ అంటుంది. 
టైటాన్ , ఎస్బీఐ స్టాక్స్ దీర్ఘకాలిక లక్ష్యంతో రానున్న 5 ఏళ్ళ వరకూ మీ పోర్ట్ ఫోలియోలో ఉంచుకోవడం  మంచి లాభదాయకం కావొచ్చని ఎపిక్ రీసెర్చ్ సూచిస్తోంది. 
రానున్న 5 ఏళ్ళ కాలం కోసం పిడిలైట్ ఇండస్ట్రీస్, హావెల్స్, యాక్సిస్ బ్యాంక్ , PVR వంటి స్టాక్స్‌ను ఎంపిక చేసుకోమని ట్రేడింగ్ బెల్స్ సంస్థ రికమెండ్ చేస్తోంది. 
అలాగే ప్రముఖ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారి కోసం టైటాన్ , బ్రిటానియా, టాటా గ్లోబల్ బేవరేజెస్, రెప్రో ఇండియా, DCB బ్యాంక్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, HDFC లైఫ్‌ , సింజీన్ (syngene) వంటి స్టాక్స్ ను రికమండ్ చేస్తున్నారు. 

 

 

Disclaimer: పైన సూచించిన సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇవ్వబడనవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');