మే నెలలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కొన్నవి..అమ్మినవి ఇవే..!

మే నెలలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కొన్నవి..అమ్మినవి ఇవే..!

గత మే నెలలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎసెట్స్ అండర్ మేనేజ్ మెంట్‌ కింద స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులు రూ. 25.94 లక్షల కోట్లకు చేరాయి. ఈ మే మాసంలో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు తమ పెట్టబడుల్లో గుణాత్మకమైన మార్పును చూపించాయి. డొమెస్టిక్ స్టాక్స్ విషయంలో 10 నెలల గరిష్టంగా 160 బేసిస్ పాయింట్లు పెరిగాయి. టెలీకాం, రియల్ ఎస్టేట్ , ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు   నెలవారీ(MoM)  ప్రాతిపదికన పుంజుకున్నాయి.  మరోవైపు ఇదే మే నెలలో మీడియా, హెల్త్ కేర్, మెటల్స్ , టెక్నాలజీ, ఆటో , వినిమయ రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. గత ఎప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీలో 44శాతం కొనుగోళ్లు జరపగా, మే నెలలో వీరు 58శాతం పెట్టుబడులను పెట్టడం గమనార్హం. 
లార్జ్ క్యాప్ రంగంలోని స్టాక్స్ అయిన వోడాఫోన్ ఐడియా, DLF, భారతీ ఎయిర్ టెల్, HDFC లైఫ్, పిరమాల్ ఎంటర్ ప్రైజెస్ వంటి స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడులను పెంచారు. 

untitled

Pic Courtesy by : Money Control 
ఇక మిడ్ క్యాప్ రంగంలోని స్టాక్స్ గోద్రేజ్ ఇండస్ట్రీస్, డిష్ టీవీ , పేజ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, టాటా గ్లోబల్ బేవరేజెస్ వంటి స్టాక్స్ ను ఇదే మే నెలలో  మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కొనుగోలు చేశారు. 
untitled

Pic Courtesy by : Money Control 
స్మాల్ క్యాప్ రంగంలోని ప్రోక్టర్ &గాంబుల్ హెల్త్, సన్ టెక్ రియాల్టీ, వెల్‌స్పన్ కార్ప్, కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, మణుప్పురం ఫిన్ వంటి స్టాక్స్‌ను  మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు కొన్నారు. 
untitled

Pic Courtesy by : Money Control 
ICICI డైరెక్ట్ సంస్థ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం కొన్ని లార్జ్ , మిడ్ క్యాప్ స్టాక్స్ ను మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు వదిలించుకున్నాయి. లార్జ్ క్యాప్ రంగంలోని స్టాక్స్ అయిన హావెల్స్ ఇండియా, ICICI లోంబార్డ్ , బంధన్ బ్యాంక్, UPL, విప్రో వంటి స్టాక్స్ ను MF మేనేజర్లు విక్రయించారు. 
untitled

Pic Courtesy by : Money Control 
మిడ్ క్యాప్ స్టాక్స్ అయిన మైండ్ ట్రీ, గ్రాఫైట్, అవంతీ ఫీడ్స్, TV 18 బ్రాడ్ కాస్ట్, అదానీ పవర్ వంటి స్టాక్స్ ను విక్రయించేశారు. 
untitled

Pic Courtesy by : Money Control 
స్మాల్ క్యాప్ రంగంలోని జైన్ ఇరిగేషన్, మ్యాక్స్ ఇండియా, టాటా ఎల్‌క్సీ, వోక్ హార్డ్ , సియట్ లిమిటెడ్ వంటి స్టాక్స్ ను మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు విక్రయించారు. 

untitled

Pic Courtesy by : Money Control 


Disclaimer: పైన పేర్కొన్న విషయాలు బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు జరిపిన క్రయ విక్రయాలు మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి. 
 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');