ఈ టైంలో మిడ్,స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను టార్గెట్ చేసిన ఓ ఫండ్..!

ఈ టైంలో మిడ్,స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను టార్గెట్ చేసిన ఓ ఫండ్..!

సరిగ్గా ఒక సంవత్సరం క్రితం దేశంలోనే 3వ లార్జెస్ట్ బ్రోకరేజ్ సంస్థ ... దేశంలోని అతి పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టమని సూచించింది మదుపర్లకు. కానీ ఇప్పుడు అదే సంస్థ తన ఇన్వెస్టర్లకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లకు మరలి పొమ్మని సలహా ఇస్తుంది. జనవరి 2018 నాటికి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు పూర్తిగా డీలా పడ్డాయి. ప్రైస్‌ కరెక్షన్‌కు గురైన ఈ స్టాక్స్ కోలుకోడానికి చాలా కాలం పట్టింది. కానీ ఇప్పుడు వీటి ఎంపిక మంచి ప్రాఫిట్స్ ను అందిస్తాయని HDFC  సెక్యూరిటీస్ పేర్కొంటుంది. లార్జ్ క్యాప్ రంగంలో లిమిటెడ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయని, ఇప్పుడు మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు మంచి తక్కువ ధరకు దొరుకుతుంన్నందున వీటి ఎంపిక సరైనదిగా HDFC సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రస్తుత మార్కెట్లను అంచనా వేస్తూ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనే వారి జాబితాలో ఇప్పుడు ఈ బ్రోకరేజ్ సంస్థ కూడా చేరింది. చిన్న స్టాక్స్ ధరలు క్షీణించడం, ముందు ముందు మెరుగైన ఆదాయాల వృద్ధి అంచనాల వల్ల ఈ స్టాక్స్ పుంజుకునే అవకాశం ఉందని HDFC అంటోంది. గత సంవత్సరం ఇదే బ్రోకరేజ్ సంస్థ ఇచ్చిన సలహా ప్రకారం NSE 50 ఇండెక్స్ 8శాతం లాభపడగా, అదే సమయంలో మిడ్ సైజ్ కంపెనీలు 7శాతం క్షీణతను చవిచూశాయి. స్మాల్ క్యాప్ రంగంలోని షేర్లు దాదాపు 19శాతం డౌన్‌ఫాల్‌ను ఎదుర్కొన్నాయి. 

Image result for hdfc securities
రెండోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడటం , వృద్ధి రేటు అంచనాలు పెరగడంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంపిక సరైనదిగా ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రాపర్టీస్, గోల్డ్  మీద ఇన్వెస్ట్‌మెంట్ కంటే ప్రస్తుతం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ మీద పెట్టుబడి సముచిత నిర్ణయంగా HDFC సెక్యూరిటీస్ భావిస్తోంది. దేశీయ ఇన్వెస్టర్లు స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ మీద దాదాపు  387 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా పేర్కొంది. ఇదే సమయంలో ఫారిన్ ఇన్వెస్టర్లు మాత్రం లార్జ్ క్యాప్ రంగానికే అతుక్కుపోయారు. రిస్క్ ఫ్యాక్టర్స్ ను వారు ఫేస్ చేయలేకపోవడమే దీనికి కారణమని ఎనలిస్టులు భావిస్తున్నారు. 

Image result for small cap mid cap
నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ జనవరి 2018 నుండి 20శాతం పడిపోయింది. నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు 9శాతం పెరగడం కూడా HDFC సెక్యూరిటీస్ స్ట్రాటజీ మార్పుకు కారణంగా చెప్పుకోవచ్చు. గుడ్ గవర్నెన్స్ , స్ట్రాంగ్ ఎర్నింగ్స్ అవుట్ లుక్ వంటి లక్షణాలు ఉన్న స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ఎంపిక చేసుకోమని , ఇవి రానున్న రోజుల్లో మంచి ప్రాఫిట్స్‌ను అందిస్తాయని  HDFC సెక్యూరిటీస్ సూచిస్తుంది. 
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ రిపోర్ట్ ప్రకారం HDFC సెక్యూరిటీస్ సంస్థ దాదాపు 6,50,000 ట్రేడింగ్ ఎకౌంట్లను కలిగిఉండి, 9 మిలియన్ల యాక్టివ్ ప్రోఫైల్ కస్టమర్లను సొంతం చేసుకుంది. 

Image result for hdfc securities small cap

Disclaimer: పైన సూచించిన సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు , ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే.
స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.