గోల్డ్, బాండ్ మార్కెట్లను చూస్తే స్టాక్స్‌కు బ్యాడ్ న్యూసే ? ఎందుకంటే..?

గోల్డ్, బాండ్ మార్కెట్లను చూస్తే స్టాక్స్‌కు బ్యాడ్ న్యూసే ? ఎందుకంటే..?

అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల నుండి వస్తున్న మార్కెట్ గాలులు ముంబై మనీ మేనేజర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పతనం, చైనా పై అమెరికా వాణిజ్య పోరు, తగ్గుతున్న ఉద్యోగ కల్పన , న్యూయార్క్ సంక్షోభం వంటివి అంతర్జాతీయంగా మార్కెట్లను కలవరపరుస్తున్నాయి. వాల్ స్ట్రీట్ మార్కెట్లు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమౌతున్నాయి. 
CBOE VIX (రాబోయే 30 రోజులలో అస్థిరత కోసం మార్కెట్ అంచనాలను సూచించే రియల్ టైమ్ మార్కెట్ సూచిక. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మార్కెట్లో ప్రమాదం, భయం లేదా ఒత్తిడి స్థాయిని కొలవడానికి పెట్టుబడిదారులు VIX ను ఉపయోగిస్తారు.) ఇండెక్స్ గత 10 ఏళ్ళ కనిష్టంలో 15.6 శాతం  నుండి 18 శాతం దిగువన ట్రేడ్ అవుతుండటం కలకలం రేపుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల మానిటరింగ్ సూచీ అయిన MSCI వరల్డ్ ఇండెక్స్ కూడా ప్రైస్ ఎర్నింగ్ రేషియోలో క్షీణతను నమోదు చేస్తూ వస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్ధిక వ్యవస్థల్లో అసమానతను రానున్న రోజుల్లో మార్కెట్ల అస్థిరతకు గురి కానున్నాయని MSCI సూచిస్తుంది. 

VIX snip 1
ఈ పరిస్థితుల్లో బులియన్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు డీలా పడ్డాయనే చెప్పొచ్చు. అమెరికన్ మార్కట్లలో అనిశ్చిత పరిస్థతుల్లో గోల్డ్ మీద పెట్టుబడులు సురక్షితమని భావించేవారు. కానీ ఇప్పుడలా లేదని గ్లోబల్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. గోల్డ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ 2007లో అత్యధికంగా 38శాతం పెరిగింది. అదేవిధంగా బాండ్ మార్కెట్లు 25 బేసిస్ పాయింట్ల కోతను ఎదుర్కోబోతున్నాయని గ్లోబల్ మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్  బ్యాంక్ యొక్క అతిపెద్ద ఆందోళన ఆ దేశ ద్రవ్యోల్బణమే. అమెరికా కోర్ ద్రవ్యోల్బణం గత 7 సంవత్సరాలలో ఫెడ్ లక్ష్యం కంటే తక్కువగా నమోదు అయింది. ఇందుకు పర్యవసానంగా మైసరీ ఇండెక్స్ లో ద్రవ్యోల్బణం , మరియు నిరుద్యోగిత రేటు 1960 నాటి కనిష్టానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం కారణంగా జీడీపీ వృద్ధి రేటు కూడా గణనీయంగా పడిపోడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్, డెట్ బాండ్ల మీద పెట్టుబడులు సురక్షితం కాదేమోనని సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. వీటి ప్రభావం ఇతర లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ మీద కూడా పడే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు.