పదేళ్లపాటు ఉంచుకోవాల్సిన 10 స్టాక్స్ ! మోడల్ పోర్ట్‌ఫోలియో

పదేళ్లపాటు ఉంచుకోవాల్సిన 10 స్టాక్స్ ! మోడల్ పోర్ట్‌ఫోలియో

స్టాక్ మార్కెట్. ఇదో మాయా ప్రపంచం.. అంటారు తెలియని వాళ్లు. ఇదో అద్భుత పెట్టుబడి సాధనం అంటారు నిపుణులు. ఇది సైన్స్ కానీ.. ఆర్ట్ మాత్రం కాదంటారు. ఎందుకంటే సైన్స్ అంటే నేర్చుకుంటే వస్తుంది. అదే ఆర్ట్ అయితే మాత్రం.. మన స్వతహాగా ఉన్నదాని మెరుగుపర్చుకోవాలి. ఈ తేడా తెలియక, చిన్న చిన్న నష్టాలకు భయపడి అత్యధిక శాతం మంది మార్కెట్లలో డబ్బులు పోగొట్టుకుంటారు. తాము చేసిన తప్పులకు, తాము ఎంపిక చేసుకున్న స్టాక్స్‌కు.. మార్కెట్లను నిందిస్తారు. అందుకే మనం పదే పదే మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్‌ను ఎంపిక చేసుకోండి అని సూచిస్తూనే ఉంటాం. అయితే ఒక్కోసారి ఎంతో అద్భుతమైన సంస్థ కూడా మార్పులకు అనుగుణంగా తనను తాను ట్యూన్ చేసుకోకపోతే చరిత్ర గమనంలో కలిసిపోతాయి. అంతే కాదు .. విస్తరణకు పోకుండా ఉన్నదానిలోనే సంతృప్తి పడ్తూ.. ఉండిపోయినా అది మిడ్ లేదా స్మాల్ సైజ్డ్ కంపెనీగా మిగిలిపోతుంది. దీని వల్ల కూడా మనం పెట్టుబడి పెట్టిన డబ్బుకు ప్రయోజనం లభించదు. అందుకే ఒకప్పటి మాదిరి ఏదైనా స్టాక్ కొని మరిచిపోయే రోజులు పోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, ఐషర్ వంటి స్టాక్స్ ఉదాహరణలకు బాగుంటాయి కానీ ఈ స్పీడ్ యుగంలో వర్కవుట్ అవడం అంత సులభం కాదు. అందుకే ఏళ్లకు ఏళ్లు స్టాక్స్‌ను మరిచిపోయే స్థితి లేదు, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉంటేనే మన లాభాలను మనం కాపాడుకున్నట్టు అవుతుంది. 

అయినప్పటికీ ఓ మోడల్ పోర్ట్‌ఫోలియోను రూపొందించి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఫండమెంటల్స్ ఉన్న ఓ పది స్టాక్స్‌ను సూచించారు నిపుణులు. ఈటీ నౌ అనే బిజినెస్ ఛానల్ పదేళ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బసంత్ మహేశ్వరి, పొరింజు, విజయ్ కేడియా, అతుల్ సూరీ, సందీప్ శబర్వాల్ వంటి వాళ్లు కొన్ని మంచి స్టాక్స్‌ను ప్రస్తావించారు. రాబోయే పదేళ్లలో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్న ఈ స్టాక్స్‌ను వివరించారు. వస్తు వినియోగం దగ్గరి నుంచి బీమా వరకూ వివిధ రంగాలను పది మంది నిపుణులు కవర్ చేశారు. 

ఎనలిస్ట్                                                                       రికమెండెడ్ స్టాక్
సందీప్ శభర్వాల్                                                         బ్రిటానియా
బసంత్ మహేశ్వరి                                                        టైటన్
సమిత్ వర్తక్                                                                 ఎడిల్వైజ్ ఫైనాన్షియల్
పొరింజు వెలియాత్                                                       టాటా గ్లోబల్
విజయ్ కెడియా                                                            రెప్రో ఇండియా
అతుల్ సూరీ                                                               హెచ్ డి ఎఫ్ సి లైఫ్
పంకజ్ మురక, రినైసాన్స్ ఇన్వెస్ట్‌మెంట్                      సింజీన్ ఇంటర్నేషనల్
మనష్ సొంతాలియా, మోతిలాల్ ఒస్వాల్                    డిసిబి బ్యాంక్
రాకేష్ అరోరా                                                               గ్రాసిం ఇండస్ట్రీస్
వినయ్ ఖట్టర్                                                              టైటన్

మరిన్ని వివరాలకు    
https://economictimes.indiatimes.com/markets/stocks/news/9-stocks-for-next-10-years-top-investors-name-their-picks-for-etnows-power-of-10/articleshow/69822266.cms

సేకరణ
నాగేంద్ర సాయిMost Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');