రిలాక్సో- హెక్సావేర్‌.. లాభాల రిలాక్స్‌

రిలాక్సో- హెక్సావేర్‌.. లాభాల రిలాక్స్‌

గత నెలలో వాటాదారులకు బోనస్‌ షేర్లను జారీచేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన బోర్డు ఇందుకు రికార్డ్‌ డేట్‌ను నిర్ణయించినట్లు వెల్లడించడంతో ఫుట్‌వేర్‌ సంస్థ రిలాక్సో ఫుట్‌వేర్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క విదేశీ రీసెర్చ్‌ సంస్థ నోమురా షేరు రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో ఐటీ సేవల దేశీ సంస్థ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం...

రిలాక్సో ఫుట్‌వేర్స్‌ లిమిటెడ్‌
వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేసేందుకు కంపెనీ బోర్డు మే నెలలోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు రిలాక్సో ఫుట్‌వేర్స్‌ పేర్కొంది. ఇందుకుగాను తాజాగా రికార్డ్‌ డేట్‌ను ఈ నెల 27గా నిర్ణయించినట్లు తెలియజేసింది. దీంతో వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 1 షేరుకి మరో షేరు ఫ్రీగా లభించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రిలాక్సో ఫుట్‌వేర్స్‌ షేరు 2.5 శాతం లాభంతో రూ. 845 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 849 వరకూ ఎగసింది. 

Related image

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌
ఇటీవల విదేశీ కంపెనీ మొబిక్విటీ ఇంక్‌ను కొనుగోలు చేయడంతో హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ షేరు రేటింగ్‌ను రెడ్యూస్‌ నుంచి న్యూట్రల్‌కు అప్‌గ్రేడ్‌ చేసినట్లు బ్రోకింగ్‌ దిగ్గజం నోమురా తాజాగా పేర్కొంది. ప్రధానంగా గత 9 నెలల్లో హెక్సావేర్‌ షేరు 25 శాతం వరకూ నీరసించడంతో రేటింగ్‌ను సవరించినట్లు వివరించింది. దీంతో షేరు టార్గెట్‌ ధరను రూ. 325 నుంచి రూ. 340కు పెంచుతున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెక్సావేర్‌ షేరు 2.5 శాతం పుంజుకుని రూ. 354 వద్ద ట్రేడవుతోంది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');