పతనంలో పీసీ జ్యువెల్స్.. 'జెట్' స్పీడ్‌!

పతనంలో పీసీ జ్యువెల్స్.. 'జెట్' స్పీడ్‌!

గత కొద్ది రోజులుగా పతన బాటలోనే కొనసాగుతున్న పీసీ జ్యువెలర్స్‌.. జెట్ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో తాజాగా  భారీ స్థాయిలో నీరసించాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పీసీ జ్యువెలర్స్‌ షేరు దాదాపు 15 శాతం కుప్పకూలింది. రూ. 50 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 48 దిగువన కనిష్టాన్ని తాకింది. ఈ షేరు గత అక్టోబర్‌26న రూ. 47 దిగువన ఏడాది కనిష్టాన్ని చేరింది. ఇక జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు సైతం 14 శాతం పతనమైంది. రూ. 71 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 68.50 వద్ద సరికొత్త కనిష్టాన్ని చవిచూసింది. ఇతర వివరాలు చూద్దాం..

Image result for pc jewellers

పీసీ జ్యువెలర్స్‌
ఇటీవల కంపెనీ బ్యాంకు సౌకర్యాల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాక పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.పీసీ జ్యువెలర్స్‌కు చెందిన బ్యాంకు రుణ సౌకర్యాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(బంగారు ఆభరణ కొనుగోలు) పథకాలను రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఎగుమతి కస్టమర్లకు పీసీ జ్యువెలర్స్‌ అనూహ్యంగా రూ. 513 కోట్లమేర డిస్కౌంట్‌ ఇచ్చిన నేపథ్యంలో పీజీజే గ్రూప్‌ నమోదు చేసిన నష్టాలను రేటింగ్ డౌన్‌గ్రేడ్‌కు పరిగణించినట్లు క్రిసిల్‌ పేర్కొంది. దీంతో వడ్డీ చెల్లింపుల సామర్థ్యం నీరసించినట్లు  తెలియజేసింది. కంపెనీ నిధుల సమీకరణకు కఠిన లిక్విడిటీ పరిస్థితులు పరీక్ష పెట్టగలవని క్రిసిల్‌ అభిప్రాయపడింది. 

Related image

జెట్ ఎయిర్‌వేస్‌
ఓవైపు పెరుగుతున్న నష్టాలు, మరోపక్క రుణ చెల్లింపుల్లో విఫలం తదితర సమస్యలతో కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీకి మరోషాక్‌ తగిలింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆదాయపన్ను శాఖ జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపక ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటా విక్రయించడం ద్వారా కంపెనీని పట్టాలపైకి ఎక్కించాలన్న ప్రయత్నాలు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు తొలుత ఆసక్తి చూపిన కంపెనీలు వెనకడుగు వేయగా.. కంపెనీపై దివాళా పిటిషన్‌సైతం దాఖలైంది. ఇటీవల డెరివేటివ్స్‌ నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరుని తొలగించడంతోపాటు.. ట్రేడ్‌టు ట్రేడ్‌ విభాగంలోకి మార్చేందుకు ఎన్‌ఎస్‌ఈ నిర్ణయించింది. దీంతో వరుసగా 11వ ట్రేడింగ్‌ సెషన్లోనూ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్ నేలచూపులకు లోనవుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ ఈ షేరు 53 శాతం కోల్పోయింది. గత మూడు రోజుల్లోనే 38 శాతం పడిపోవడం గమనార్హం!Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');