ఆర్‌ఇన్‌ఫ్రా- పతనానికి అంతెక్కడ?

ఆర్‌ఇన్‌ఫ్రా- పతనానికి అంతెక్కడ?

బిజినెస్‌ నిర్వహణలో కంపెనీ సామర్థ్యంపై తాజాగా ఆడిటర్లు సందేహాలు లేవనెత్తడంతో అడాగ్‌ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తోపాటు.. అనుబంధ సంస్థ ముంబై మెట్రో.. గ్రూప్‌లోని మరో కంపెనీ రిలయన్స్ నావల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, తదితర అనుబంధ సంస్థలపైనా ఆడిటర్లు ఆందోళన వెలిబుచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాన సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నష్టాలు నమోదు చేస్తున్నందున కంపెనీ గ్యారంటర్‌గా ఉన్న రుణాల విషయంలోనూ సందేహాలున్నట్లు ఆడిటర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కంపెనీల షేర్లు అమ్మకాలతో బోర్లా పడ్డాయి. 

పతన బాటలోనే
అడాగ్‌ కౌంటర్లలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 8 శాతం  కుప్పకూలి రూ. 55 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50.50 దిగువన మూడు దశాబ్దాల కనిష్టానికి చేరింది. ఈ బాటలో రిలయన్స్ కేపిటల్ సైతం 5.25 శాతం పతనమై రూ. 72 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు తొలుత రూ. 69 దిగువన చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇక రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 5.2 శాతం దిగజారి రూ. 13.50 వద్ద సరికొత్త కనిష్టానికి చేరగా.. రిలయన్స్‌ నావల్‌ 8.2 శాతం వెనకడుగుతో రూ. 5.4 వద్ద చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇదే విధంగా రిలయన్స్‌ పవర్‌ 2 శాతం నష్టంతో రూ. 5.3 వద్ద, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 3 శాతం క్షీణించి రూ. 1.55 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది కూడా సరికొత్త కొత్త కనిష్టంకావడం గమనార్హం!

క్యూ4లో భారీ నష్టాలు
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 3301 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2017-18) క్యూ4లో రూ. 134 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు మాత్రం 30 శాతం ఎగసి రూ. 4013 కోట్లను తాకాయి. నష్టాలు ప్రధానంగా 2016లో కొనుగోలు చేసిన రిలయన్స్ నావల్‌కు సంబంధించి వన్‌టైమ్‌ చార్జీలవల్ల ఏర్పడినట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రా పేర్కొంది. కాగా.. వచ్చే ఆర్ధిక సంవత్సరంలోగా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించే చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');