యాస్టర్‌  డీఎం హెల్దీ.. ఎస్‌చాంద్‌కు బీపీ

యాస్టర్‌  డీఎం హెల్దీ.. ఎస్‌చాంద్‌కు బీపీ

కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసినట్లు వెల్లడించడంతో యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోవైపు కంపెనీ సీఎఫ్‌వోపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానా విధించిన వార్తలతో ఎస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌
కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ను A- నుంచి BBB+కు రేటింగ్ సంస్థ ఇక్రా అప్‌గ్రేడ్‌ చేసినట్లు యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ తాజాగా తెలియజేసింది. దీనిలో భాగంగా కంపెనీ ఔట్‌లుక్‌ను స్థిరత్వం(స్టేబుల్‌) నుంచి సానుకూలం(పాజిటివ్‌)కు ఎగువముఖంగా సవరించినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసింది. రూ. 140 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 142 వరకూ ఎగసింది.

Related image

ఎస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు విద్యా సంబంధ పుస్తక ప్రచురణ, పంపిణీ సంస్థ ఎస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ సీఎఫ్‌వో సౌరభ్‌ మిట్టల్‌కు రూ. 1.29 లక్షల జరిమానాను సెబీ విధించింది. దీంతో వరుసగా ఐదో రోజు ఈ కౌంటర్‌ అమ్మకాలతో బలహీనపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎస్‌ చాంద్‌ షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 85 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 84 వద్ద సరికొత్త కనిష్టాన్ని తాకింది.Most Popular