ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు..?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు..?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్టు(ఫ్లాట్‌)గా మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ స్వల్పంగా 8 పాయింట్లు క్షీణించి 11,823 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ వారం ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రధానంగా టెక్నాలజీ, చిప్‌ కౌంటర్లలో అమ్మకాల కారణంగా నాస్‌డాక్‌ బలహీనపడింది. కాగా.. వరుసగా మూడో రోజు శుక్రవారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవిచూడటంతో నేడు కూడా కొంతమేర ఒడిదొడుకులు కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
చివర్లో పతనం
వారాంతాన వరుసగా మూడో రోజు బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో రోజంతా నేలచూపులతోనే కదిలాయి. చివర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ సైతం 100 పాయింట్లకుపైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌ 289 పాయింట్లు క్షీణించి 39,452 వద్ద నిలవగా.. నిఫ్టీ 91 పాయింట్ల వెనకడుగుతో 11,823 వద్ద స్థిరపడింది.    

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,777 పాయింట్ల వద్ద, తదుపరి 11,730 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,891 పాయింట్ల వద్ద, తదుపరి 11,958 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,404, 30,195 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,929, 31,242 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) వారాంతాన దాదాపు రూ. 239 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 376 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 172 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 445 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');