గత వారం చిన్న షేర్లు బోర్లా

గత వారం చిన్న షేర్లు బోర్లా

వాణిజ్య వివాదాలు, చమురు ధరలు, రుతు పవనాల ఆలస్యం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పలుమార్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. అయితే.. ఓమాదిరి నష్టాలతోనే సరిపెట్టుకున్నాయి. శుక్రవారం(14)తో ముగిసిన వారం.. సెన్సెక్స్‌ నికరంగా 164 పాయింట్లు(0.4 శాతం) క్షీణించి 39,452 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 47 పాయింట్లు(0.4 శాతం) వెనకడుగుతో 11,823 వద్ద స్థిరపడింది.

స్మాల్‌ క్యాప్‌ పతనం
గత వారం మార్కెట్లను మించుతూ మధ్య, చిన్నతరహా కౌంటర్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.25 శాతం వెనకడుగుతో 14,721 వద్ద ముగిసింది. స్మాల్‌క్యాప్‌ మరింత అధికంగా 2 శాతం తిరోగమించి 14,366 వద్ద నిలిచింది.

Image result for yes bank and indusind bank

ఆటో స్కిడ్‌
నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 17 శాతం కుప్పకూలగా.. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ  బాటలో బీపీసీఎల్‌, హీరోమోటో, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, మారుతీ 3 శాతం చొప్పున డీలాపడ్డాయి. అయితే టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌, వేదాంతా 4-3 శాతం మధ్య ఎగశాయి.

Related image

మిడ్‌క్యాప్స్‌ డీలా
మధ్యతరహా షేర్లలో జెట్ ఎయిర్‌వేస్‌, జేఅండ్‌కే బ్యాంక్‌, రిలయన్స్ కేపిటల్‌, మన్‌పసంద్‌, సుజ్లాన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఆర్‌కామ్‌, ఐబీ ఇంటిగ్రేటెడ్‌, టేక్‌ సొల్యూషన్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ 35-13 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. మరోవైపు అబాట్‌, మదర్‌సన్‌, మణప్పురం, ఫోర్టిస్‌ హెల్త్‌, స్టెరిలైట్‌ టెక్‌, టీమ్‌లీజ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, యుకో బ్యాంక్‌, మ్యాక్స్‌, నవీర్‌ ఫ్లోరిన్‌ తదితరాలు 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి.  Most Popular