అరబిందో వీక్‌- లాభాల.. కల్పతరు

అరబిందో వీక్‌- లాభాల.. కల్పతరు

గత నెలలో తెలంగాణలోని బాచుపల్లి యూనిట్లో తనిఖీలు నిర్వహించిన అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ 10 లోపాలను గుర్తించినట్లు వెల్లడికావడంతో హెల్త్‌కేర్‌ రంగ హైదరాబాద్‌ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. కాగా.. మరోపక్క కంపెనీ పురోభివృద్ధిపై సానుకూల అంచనాలతో రీసెర్చ్‌ సంస్థ ఫిలిప్‌కేపిటల్‌ బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. వివరాలు చూద్దాం..

అరబిందో ఫార్మా
బాచుపల్లి యూనిట్లో డేటా ఇంటెగ్రిటీ వీగిపోయిందంటూ యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు అరబిందో ఫార్మా లిమిటెడ్‌ పేర్కొంది. ఫినిష్‌డ్‌ డోసేజీల ఈ ప్లాంటులో మే 13-24 మధ్య తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఫామ్‌ 483ను జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 5 శాతంపైగా పతనమై రూ. 603 దిగువకు చేరింది. ప్రస్తుతం కాస్త రికవరీ సాధించి 2.5 శాతం నష్టంతో రూ. 621 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇవి సాధారణ లోపాలేనంటూ ఇప్పటికే అరబిందో ఫార్మా పేర్కొంది. ఈ అంశంపై ఫిలిప్‌ కేపిటల్‌ స్పందిస్తూ.. స్వల్ప కాలంలోనే అరబిందో వీటిని పరిష్కరించుకుంటుందని అభిప్రాయపడింది. ఫలితంగా అరబిందో షేరుకి బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తూ రూ. 900 టార్గెట్‌ ధరను ప్రకటించింది.

Image result for kalpataru power transmission ltd

కల్పతరు పవర్‌
విద్యుత్‌ ప్రసారం, పంపిణీ, మౌలిక సదుపాయాల దిగ్గజం కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ సాధించిన పటిష్ట ఆర్డర్‌బుక్‌ నేపథ్యంలో రీసెర్చ్‌ సంస్థ ఫిలిప్‌కేపిటల్‌ బయ్‌ రేటింగ్‌ను ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా రూ. 670 టార్గెట్‌ ధరను ప్రకటించింది. మౌలిక సదుపాయాల విభాగంలో కల్పతరు ప్రత్యేకత కలిగిన కంపెనీగా ఫిలిప్‌ పేర్కొంది. రానున్న రెండేళ్లలో వార్షిక ప్రాతిపదికన ఆదాయం 19 శాతం చొప్పున వృద్ధి సాధించగలదని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కల్పతరు షేరు 2.2 శాతం పుంజుకుని రూ. 501 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 503 వరకూ బలపడింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');