నష్టాలలో.. మీడియా- రియల్టీ బోర్లా

నష్టాలలో.. మీడియా- రియల్టీ బోర్లా

ఇటీవల హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి బలహీనంగా ప్రారంభమయ్యాయి. తదుపరి అమ్మకాలు పెరగడంతో నేలచూపులతో కదులుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 177 పాయింట్లు క్షీణించి 39,564కు చేరగా.. నిఫ్టీ 60 పాయింట్ల వెనకడుగుతో 11,854 వద్ద కదులుతోంది. కాగా.. చమురు ధరలు పుంజుకోవడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడినప్పటికీ నేటి ట్రేడింగ్‌లో ఆసియాలో బలహీన ధోరణి కనిపించింది. ఈ నేపథ్యంలో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల అనిశ్చితుల కారణంగా దేశీ మార్కెట్లలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఇండస్‌ఇండ్‌ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, మీడియా రంగాలు 2 శాతం క్షీణించగా.. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్వల్పంగా 0.2 శాతం బలపడ్డాయి. మీడియా స్టాక్స్‌లో జీ, ఈరోస్‌, డిష్‌ టీవీ, నెట్‌వర్క్‌ 18, టీవీ టుడే, జాగరణ్‌ 5-1.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, శోభా 4-1.3 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌,  కొటక్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్‌, ఆర్‌ఐఎల్‌ 5-1 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో.. ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, వేదాంతా, గెయిల్‌ మాత్రమే అదికూడా 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

జెట్‌ ఎయిర్‌ పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ 10 శాతం కుప్పకూలగా.. రిలయన్స్‌ కేపిటల్‌, దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, భారత్‌ ఫైనాన్స్‌, ఎస్కార్ట్స్‌ 7.5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఇన్ఫీబీమ్‌, ఎన్‌ఎండీసీ, టాటా ఎలక్సీ, మణప్పురం, ఎన్‌సీసీ, జీఎస్‌ఎఫ్‌సీ, హెక్సావేర్‌, వొకార్డ్‌, టాటా కమ్యూనికేషన్స్‌, సీఈఎస్‌సీ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నష్టాలతో కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1441 నష్టపోగా.. 756 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');