దివాన్‌.. యస్‌ బ్యాంక్‌- మళ్లీ బోర్లా

దివాన్‌.. యస్‌ బ్యాంక్‌- మళ్లీ బోర్లా

ప్రమోటర్‌ వాటాలో కొంతమేర విక్రయించడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామికి కంపెనీ నియంత్రణను అప్పగించే యోచనలో ఉన్నట్లు వెలువడ్డ వార్తలు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కౌంటర్‌ను వరుసగా రెండో రోజు దెబ్బ తీస్తున్నాయి. కాగా.. మరోపక్క డైరెక్టర్ల రాజీనామాలకుతోడు విదేశీ రీసెర్చ్ దిగ్గజం యూబీఎస్‌ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ మరోసారి నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
వ్యూహాత్మక భాగస్వామికి సగం వాటాను విక్రయించేందుకు సిద్ధమంటూ ప్రమోటర్లు వెల్లడించినట్లు వెలువడ్డ వార్తలు దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్‌ మళ్లీ బోర్లా పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6 శాతం పతనమైంది. రూ. 79 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 78కు చేరింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. కంపెనీ ప్రమోటర్‌ కపిల్‌ వాధ్వాన్‌ ఎండీ పదవి నుంచి సైతం తప్పుకునేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే చైర్మన్‌గా కొనసాగడం ద్వారా కొత్త భాగస్వామితో కలసి సంయుక్తంగా కంపెనీ యాజమాన్య నిర్వహణ చేపట్టేందుకు కపిల్‌ వాధ్వాన్‌ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం దివాన్‌ హౌసింగ్‌లో వాధ్వాన్‌ కుటుంబానికి 39.21 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో గురువారం సైతం దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 9.5 శాతం పడిపోయి రూ. 84 వద్ద ముగిసింది. కాగా.. దాదాపు రూ. 962 కోట్ల విలువైన ఎన్‌సీడీల చెల్లింపులను ఈ నెల 6కల్లా పూర్తిచేసినట్లు వెల్లడించడంతో ఈ షేరు బుధవారం జోరందుకోవడం గమనార్హం. 

Image result for Yes bank ltd

యస్‌ బ్యాంక్‌
ఇటీవల నేలచూపులతో కదులుతున్న యస్‌ బ్యాంక్‌ షేరు టార్గెట్‌ ధరను విదేశీ బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ కుదించడంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు 2 శాతం క్షీణించి రూ. 115 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 113 దిగువన 40 నెలల కనిష్టానికి చేరింది. గతంలో ఇచ్చిన యస్‌ బ్యాంక్‌ టార్గెట్‌ ధర రూ. 170ను యూబీఎస్‌ రూ. 90కు తగ్గించింది. బ్యాంకు వేగవంతంగా టర్న్‌అరౌండ్ అయ్యే పరిస్థితులు తక్కువేనని ఈ సందర్భంగా యూబీఎస్‌ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పనితీరు మరింత నీరసించవచ్చని అంచనా వేసింది. ఫలితంగా గురువారం సైతం యస్‌ బ్యాంక్‌ షేరు 12 శాతం కుప్పకూలి రూ. 117 వద్ద ముగిసింది. కాగా.. టాప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేపడుతున్న నేపథ్యంలో ఇటీవల యస్‌ బ్యాంక్‌ బోర్డు నుంచి నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ముకేష్ సబర్వాల్‌, నాన్‌ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌.. పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం సైతం యస్‌ బ్యాంక్‌ షేరు 3 శాతం క్షీణించి రూ. 135 వద్ద ముగిసింది. ఇక మంగళవారం మూడీస్‌ ఇన్వెస్టర్ సర్వీసెస్‌ యస్‌ బ్యాంక్‌ విదేశీ కరెన్సీ జారీ రేటింగ్‌ను Ba1కు సవరించింది. ఫైనాన్స్‌ కంపెనీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ ఒత్తిళ్ల కారణంగా బ్యాంక్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ బలహీనపడవచ్చని మూడీస్‌ అభిప్రాయపడింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');