ఇండస్‌ఇండ్‌- భారత్‌ ఫైనాన్స్‌.. విలీన దెబ్బ?

ఇండస్‌ఇండ్‌- భారత్‌ ఫైనాన్స్‌.. విలీన దెబ్బ?

మైక్రోఫైనాన్స్‌ కంపెనీ భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ను విలీనం చేసుకునేందుకు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(NCLT) అనుమతించిన నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు భారత్‌ ఫైనాన్షియల్‌ కౌంటర్లోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 4 శాతం పతనమైంది. రూ. 1429 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1425 వరకూ  జారింది. ఈ బాటలో భారత్‌ ఫైనాన్స్‌ షేరు సైతం 4 శాతం క్షీణించి రూ. 902 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 902 దిగువకూ చేరింది. ఇతర వివరాలు ఇలా..

యూబీఎస్‌ ఎఫెక్ట్‌
విదేశీ బ్రోకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కౌంటర్‌ గురువారం సైతం బలహీనపడిన సంగతి తెలిసిందే. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌  షేరుకి గతంలో ఇచ్చిన న్యూట్రల్‌ రేటింగ్‌ను రీసెర్చ్ సంస్థ యూబీఎస్‌ సెల్‌(అమ్మవచ్చు)కు సవరించింది. రుణ వ్యయాలు పెరగనున్న అంచనాలతో రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు పేర్కొంది. దీంతో ఇండస్‌ఇండ్‌ షేరుకి రూ. 1400 టార్గెట్‌ ధరను సైతం ప్రకటించింది. క్రెడిట్‌ వ్యయాలు 65 బేసిస్‌ పాయింట్లమేర పెరగవచ్చంటూ బ్యాంక్‌ అంచనా వేస్తున్నప్పటికీ ఇవి 150 బేసిస్‌ పాయింట్లవరకూ ఉండొచ్చని యూబీఎస్‌ అభిప్రాయపడింది. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌కు అర్హంకాని రుణాలు పెరుగుతున్నట్లు పేర్కొంది. 

విలీనం ప్రయోజనమే
భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ను విలీనం చేసుకోవడం ద్వారా ఇండస్‌ఇండ్‌ బ్యాంకు పన్నుకు ముందు లాభం(ఇబిటా) 25 శాతం పుంజుకోవచ్చని యూబీఎస్‌ ఊహిస్తోంది. ఇదే విధంగా ఈపీఎస్‌ 8.5 శాతంమేర బలపడవచ్చని అంచనా వేస్తోంది. బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా చేపట్టే మైక్రోఫైనాన్సింగ్‌ బిజినెస్‌.. ఎన్‌బీఎఫ్‌సీలకంటే లాభదాయకంగా ఉంటుందని తెలియజేసింది. దీంతో అధిక రిటర్నులకు అవకాశముంటుందని అభిప్రాయపడింది. అయితే ఈ బిజినెస్‌లో ప్రస్తుత రుణవ్యయాలు సగటుకంటే తక్కువగా ఉండటంతో అన్‌సెక్యూర్డ్‌ రుణాల బిజినెస్‌ రిస్కులను ఈ రంగం పూర్తిగా ప్రతిఫలించడంలేదని వివరించింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');