బోనస్‌తో రైట్స్‌.. రైట్‌- హెక్సావేర్‌ అప్‌

బోనస్‌తో రైట్స్‌.. రైట్‌- హెక్సావేర్‌ అప్‌

ఇటీవలే స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన రైల్వే రంగ ఇంజినీరింగ్‌, కన్సల్టెన్నీ సేవల సంస్థ రైట్స్‌(RITES) లిమిటెడ్‌ వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు నష్టాల మార్కెట్లోనూ ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. మరోపక్క డిజిటల్‌ ప్రొడక్టుల యూఎస్‌ సంస్థను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించడంతో దేశీ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇతర వివరాలు ఇలా..

రైట్స్‌ లిమిటెడ్‌
మినీరత్న పీఎస్‌యూ కంపెనీ.. రైట్స్‌ లిమిటెడ్‌ తాజాగా వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదన చేసింది. బోనస్‌ ఇష్యూ ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఈ నెల 24న నిర్వహించనున్న సమావేశంలో పరిశీలించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 291 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 297 వరకూ ఎగసింది. కాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 20 శాతం ర్యాలీ చేయడం విశేషం!   

Related image

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌
యూఎస్‌ సంస్థ మొబిక్విటీ ఇంక్‌ను కొనుగోలు చేస్తున్నట్లు హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ తాజాగా పేర్కొంది. తద్వారా క్లౌడ్‌, ఆటోమేషన్‌ విభాగాలలో మరిన్ని సేవలను అందించనున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్లను విస్తరించిన మొబిక్విక్‌ను 18.2 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 1260 కోట్లు) సొంతం చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇందుకు తొలుత విడతగా 13.1 కోట్ల డాలర్లను చెల్లించనున్నట్లు తెలియజేసింది. 2018లో మొబిక్విక్‌ 7 కోట్ల డాలర్లు ఆదాయం ఆర్జించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో హెక్సావేర్ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 356 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 359ను అధిగమించింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');