2019 లో బెస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే...!

2019 లో బెస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే...!

మ్యూచువల్ ఫండ్ ఎడ్వైజర్స్ అంచనాల ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడి దారులకు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు అధిక రాబడులను తీసుకొస్తాయి. ఇదే విషయంపై ఎకానమిక్స్ టైమ్స్ .కామ్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుతం అయితే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కొంత నెగిటివ్ ట్రెండ్‌లో కనబడతున్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ ఎనలిస్టులు మాత్రం వీటిపై నమ్మకం ఉంచుతున్నారు. ఇందులో మంచి ఎమర్జింగ్ ట్రెండ్ రానుందని, రానున్న 3-4 ఏళ్ళలో ఇవి మంచి ప్రాఫిట్స్ ను అందిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. కొత్తగా వస్తున్న మదుపర్లకు మ్యూచువల్ ఫండ్స్ ఎడ్వైజర్స్ ఇందులో పెట్టుబడులు పెట్టమని సలహా ఇవ్వడం లేదు. ఎందుకంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ వయలేషన్స్ ఉంటాయి కాబట్టి. రిస్క్ ను , అస్థిరతను ఎదుర్కొనే మదుపర్లకు ఇలాంటి ఫండ్స్ బాగా కలిసొస్తాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. హై రిస్క్ ను ఎదుర్కొనగలిగి, 7-10 సంవత్సరాల కాలం పాటు వేచి ఉండగలిగే ఇన్వెస్టర్లకు మాత్రమే ఇందులో పెట్టుబడలు పెట్టమని సలహా ఇస్తున్నారు. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు మిడ్ సైజ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. ఆ కంపెనీలు లార్జ్ కంపెనీలుగా ఎదిగితే ఆటోమేటిక్‌గా ఇందులో  పెట్టుబడి పెట్టిన వారు కూడా లాభపడతారు. ఒక వేళ కంపెనీలు ఎదగక పోయినా.. పెట్టుబడి మీద స్వల్ప నష్టాలతో బయట పడొచ్చన్నది ఎనలిస్టుల అంచనా. ఇందులో ఎంత వయలేషన్స్ ఉన్నప్పటికీ.. లాభాల విషయంలో కూడా మిగతా షేర్ల కంటే అత్యధిక లాభాలు చూపించేది ఒక్క మిడ్ క్యాప్ మ్యూచువల్స్ మాత్రమే అని బ్రోకింగ్ కంపెనీలు పేర్కొంటున్నాయి.  

Image result for mid cap mutual funds
ఎకానమిక్స్ టైమ్స్ .కామ్ అంచనాల ప్రకారం బెస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ 2019 ఎవంటే...

1.) L&T మిడ్ క్యాప్ ఫండ్ 
2.) HDFC మిడ్ క్యాప్ ఆపర్చ్యునిటీస్ ఫండ్ 
3.) DSP మిడ్ క్యాప్ ఫండ్ 
4.) ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 
5.) యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ 

Image result for mid cap mutual funds

ET.కామ్  మ్యూచువల్ ఫండ్స్ మీద కొన్ని పారమితులను ఉపయోగించి సర్వే జరిపింది. ఏ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ మదుపర్లకు ఎక్కువ లాభదాయకత చూపిస్తుందో అంచనాలు వేసింది. దీని ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ ప్రామాణికాలను అది తయారు చేసింది. 
1. గత మూడు సంవత్సరాలుగా ఆయా మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న స్టాక్స్ ఇండెక్స్ సూచీల్లో క్రియాశీలకంగా ఉండటం.
2. డౌన్ సైడ్ రిస్క్‌ను తక్కువగా కలిగి ఉండటం.
3. మార్కెట్లలో అత్యంత వయలేషన్స్ కనబడినప్పటికీ ఈ స్టాక్స్ స్థిరంగా ఉండటం
4. గత 3 ఏళ్ళుగా  మ్యూచువల్ ఫండ్స్ లోని మిడ్ క్యాప్ స్టాక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేశాయా ? లేదా అని పరిశీలించడం.
5. ఆయా స్టాక్స్ యొక్క కంపెనీల అసెట్స్ పరిమాణం ఎలా ఉంది. మార్కెట్ క్యాప్ నిలకడగా ఉందా లేదా అన్నదానిని పరిశీలించడం. 
ఇలా పై అంశాలను పరిశీలించి ఆయా మిడ్ క్యాప్ స్టాక్స్ మీద పెట్టుబడులు పెట్టగలిగిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోడం సరైన నిర్ణయంగా ఈటీ.కాం పేర్కొంటుంది. మరి మీ ఇన్వెస్ట్ మెంట్ ఎటువైపు...? 


Disclaimer: పైన పేర్కొన్న సలహాలు , సూచనలు ప్రముఖ సంస్థలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్
ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');