గత నెల్లో ఎంఎఫ్‌ పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే..

గత నెల్లో ఎంఎఫ్‌ పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే..

మ్యూచువల్‌ ఫండ్స్‌కు మళ్ళీ ఆదరణ లభిస్తోంది. గత ఏడాదిన్నర కాలంలో విక్రయాలతో కొంత ఇబ్బందిపడిన మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ప్రస్తుతం కొనుగోళ్ళతో కళకళలాడుతోన్నాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు రూ.46.1 బిలియన్ల నుంచి రూ.54.1 బిలియన్లకు పెరిగాయి. ఇక గత నెల్లో టాప్‌-3 ఫండ్స్‌ పెట్టుబడులను ఒక్కసారి పరిశీలిద్దాం.

1. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ : దేశంలోనే టాప్‌ మనీ మేనేజర్‌ అయిన ఈ సంస్థ 22 బిలియన్‌ డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లను కలిగివుంది. ఇందులో కొత్తగా కొన్ని కంపెనీల షేర్లను జతచేసుకోగా.. మరికొన్ని కంపెనీల షేర్లను విక్రయించింది. 

2. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్ ఫండ్‌ : ఈ సంస్థ మొత్తం $19 బిలియన్‌ డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లను హోల్డ్‌ చేస్తోంది. గత నెల్లో కొత్తగా ప్రుడెన్షియల్‌ ఐసీఐసీఐ టెక్నాలజీ ఫండ్‌, నియోజెన్‌ కెమికల్స్‌కు చెందిన షేర్లను గత నెల్లో కొత్తగా కొనుగోలు చేసింది. 

3. ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ : ఈ సంస్థ పోర్ట్‌ఫోలియో 300 స్టాక్స్‌పైనే. ఈక్విటీలో మొత్తం 22 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను కలిగివుంది. ఇంతకుముందు ఉన్న స్టాక్స్‌లో వొడాఫోన్‌ ఐడియా, మదర్సన్‌ సుమి, భారతి ఎయిర్‌టెల్‌లో అదనపు షేర్లను ఈ కంపెనీ కొనుగోలు చేసింది.Most Popular