ఆ హీరోయిన్ ఆదాయం ఎంతో తెలుసా ?

ఆ హీరోయిన్ ఆదాయం ఎంతో తెలుసా ?

బాలీవుడ్ హీరోయిన్స్ హాలీవుడ్ ఎంట్రీ చాలా ఈజీ అయిపోవడం ఇప్పుడు చూస్తున్నాం..ఐతే మనోళ్ల రెమ్యునరేషన్ కూడా వారి స్థాయికి చేరడమే ఇపుడు రీసెంట్ సెన్సేషన్..ఓంశాంతి ఓం ఫేమ్ దీపికా పడుకునే ట్రిపుల్ ఎక్స్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే కదా...దాంతో పాటే వాల్డ్ హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెసెస్  లిస్ట్ లో ఈమె కూడా చేరిపోయిందని ఫోర్బ్స్ తాజాగా రిలీజ్ చేసిన ఎడిషన్‌లో చెప్పింది

టాప్ ఫస్ట్ లో అమెరికన్ యాక్ట్రెస్ కమ్ యాంకర్ జెన్నిఫర్ లారెన్స్ నిలవగా...దీపికా పడుకునే టెన్త్ ప్లేస్ దక్కించుకుంది. లారెన్స్ రెమ్యునరేషన్ ఏడాదికి 46 మిలియన్ డాలర్లని (సుమారు రూ.308 కోట్లు) చెప్తుండగా.. మన బ్యూటీ రోజుకి ఎంత వసూలు చేస్తోందో మాత్రం తెలియడం లేదు. ఐతే దీపిక సంపాదిస్తున్న మొత్తం ఎంతలేదన్నా 10 మిలియన్ డాలర్లకు (రూ.68 కోట్లు) తక్కువ ఉండబోదని లెక్క తేలుస్తోంది ఫోర్బ్స్. గత ఏడాదితో పోల్చుకుంటే జెన్నిఫర్ ఆదాయంలో 11 శాతం తగ్గింది. అయినా వరుసగా రెండో ఏడాది కూడా టాప్ పెయిడ్ యాక్ట్ర్సెస్‌గా రికార్డు కంటిన్యూ చేస్తోంది. మెలిసా మెకార్తే 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 225 కోట్లు) ఆదాయంతో ఫోర్బ్స్ జాబితా లో రెండో స్థానం దక్కించుకుంది.. ఇంకా ఎవరెవరు ఎంతెంత ఆదాయాలతో రికార్డులు సృష్టించారో ఆగస్ట్ 25న ఫోర్బ్స్ పూర్తి జాబితా విడుదల చేయనుంది. Most Popular